Washing Machine : కేవలం ఒక్క గ్లాసు నీటితో 80 సెకండ్లలో బట్టలను ఉతికే వాషింగ్ మిషన్… ఇది ఎలా సాధ్యం..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Washing Machine : కేవలం ఒక్క గ్లాసు నీటితో 80 సెకండ్లలో బట్టలను ఉతికే వాషింగ్ మిషన్… ఇది ఎలా సాధ్యం..?

 Authored By prabhas | The Telugu News | Updated on :30 July 2022,1:40 pm

Washing Machine : కొంతకాలం క్రిందట ఎంతమంది బట్టలైనా మనుషులే ఉతికేవారు. ఎంతటి మురికినైనా వదిలించేవారు. అయితే కాలంతోపాటు జీవన విధానాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులు తయారుచేసి మనుషులకి పని తగ్గించి, వాటిని వాడుతున్నారు. దానిలో ఒకటి వాషింగ్ మిషన్, ఇది కొంతకాలం నుండి దీనిని చాలామంది వాడుతున్నారు. అయితే సాధారణంగా వాషింగ్ మిషన్లు బట్టలు ఉతకాలి అంటే 100 లీటర్ల నీటి నుంచి 150 లీటర్ల వరకు నీరు పడుతుంది. అలాగే ఆరు ఏడు కేజీల బట్టలను ఉతకాలి అంటే ఒక గంట సమయం తీసుకుంటుంది. అంటే అవి బయటికి రావాలి అంటే ఒక గంట సమయం పడుతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఒక వాషింగ్ మిషను మన ముందుకు తీసుకొచ్చారు.

ఆ మిషన్ 80 సెకండ్లలో ఒక గ్లాసు నీటితో బట్టలని ఉతుకుతుంది అంట. అలా ఎలా సాధ్యపడుతుందో తెలుసుకుందాం. ఇలా జరగడం ఒక వింతే కదా… ఇండియా స్టార్ట్ అప్ వారు వేస్టేజ్ ను అరికట్టి, కెమికల్స్ వాడకాన్ని తగ్గించే ..ఈ మిషన్ ను స్టార్ట్ అప్ కు చెందిన నితిన్ కుమార్ సలూజ , వీరేందర్ సింగ్, రాహుల్ గుప్తా దీనిని తయారు చేశారు. ఈ మిషన్ ఐఎస్పి స్టీమ్ టెక్నాలజీ ద్వారా వర్క్ చేస్తుందంట. అంటే పొడి ఆవిరి రేడియో ఫ్రీక్వెన్సీ తో కూడుకున్న మైక్రోవేవ్ సామర్థ్యంతో బట్టలను క్లీన్ చేస్తుంది. అయితే ఈ మిషన్ లో బట్టలు వేయగానే ఆయానికరణ చేయని ఎలక్ట్రిక్ కిరణాలు బట్టల పై ఉన్న బ్యాక్టీరియాను చంపేస్తాయి. అలాగే ఒక గ్లాసు నీరు, పొడి ఆవిరి రూపంలోకి మారి, బట్టల పై ఉన్న మొండి మురికిని పోగోడతాయి.

New Washing Machine will wash clothes in 80 seconds

New Washing Machine will wash clothes in 80 seconds

ఇలా ఒక భాగం పూర్తవుతుంది ఇంకా బాగా మొండి మురికి ఉన్న బట్టలు అయితే ఎలా రెండు మూడు సార్లు వెయ్యాలి. మొండి మురికి ఉన్న బట్టలు కి అయితే పెద్ద మిషన్ అయితే చాలా బాగుంటుంది. అప్పుడు దీనికి 4 5 గ్లాసుల నీరు పడుతుంది. ఆరు కిలోల వరకు ఉతుకుతుంది. ఇలాంటి ఈ మిషను పంజాబ్లో చిత్కర యూనివర్సిటీ వారు, విద్యార్థులతో కలిసి రబుల్ గుప్తా, వీరేందర్ సింగ్, నితిన్ కుమార్ సలూజ దీనిని తయారు చేయడం జరిగింది. ఇలా 80 సెకండ్లలో ఒక గ్లాసునీటితో బట్టలు ఉతికే మిషన్ మన ముందుకి వస్తే.. అది ఒక వింతే అవుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది