Washing Machine : బట్టలు వాషింగ్ మెషిన్ లో వేసినప్పుడు ఈ టిప్స్ ను పాటించండి.. అతి తక్కువ డిటర్జెంట్ పౌడర్ తో బట్టలు మెరిసిపోతాయి…!
Washing Machine : ఒకప్పుడు బట్టలు ఉతకడం అనేది చాలా కష్టంగా ఉండేది.. ఎందుకంటే ఎన్ని బట్టలు అయినా సరే మనుషులే ఉతికేవారు.. ఉతకడం, పిండడం, ఆరేయడం ఇలా మనుషులే చాలా కష్టపడి చేసేవాళ్లు కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో అలాంటివి చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎందుకనగా చాలామంది ఇళ్లలో ఈ బట్టలు ఉతికే వాషింగ్ మెషన్లు ఉంటున్నాయి. సింపుల్గా ఈ మిషన్లో ఎన్ని బట్టలైనా సరే వేస్తే 30 మినిట్స్ లో ఉతకడం జాడించడం, పిండడం అందులోనే ఎండి రావడం జరుగుతుంది. అలాంటి వాషింగ్ మెషన్లు బట్టలు వేస్తున్నప్పుడు. అప్పుడప్పుడు వాటి మురికి సరిగా వదలకుండా మనం వేసిన పౌడర్ అక్కడక్కడ బట్టలకి అలాగే ఉంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలామంది తక్కువ డిటర్జెంట్ తక్కువ నీటితో బట్టలు మెరిసిపోవాలని అనుకుంటూ ఉంటారు.
అయితే వాషింగ్ మిషన్ సరిగా వినియోగించకపోతే బట్టలు మురికి సరిగా వదలదు.. అలాగే బట్టల పై అక్కడక్కడ డిట్ర్జెంట్ పౌడర్ అతుక్కుని ఉంటూ ఉంటుంది. ఇలాంటి సమస్య చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. అయితే ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే.. కొన్ని టిప్స్ ని పాటిస్తూ బట్టలు ఈజీగా మెరిసిపోయేలా చేసుకోవచ్చు. పదేపదే లాండ్రి బ్యాగులు ఉంచిన బట్టలు ఉతకడానికి మిషన్లు వేస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల దుస్తులను కలిపి ఉతకడం వల్ల కొన్ని మార్లు బట్టలు మురికి వదలవు.. గట్టి దుస్తులతో మృదువైన దుస్తులు వేయడం వలన అవి ఖరాబయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కొన్నిసార్లు చినిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకనగా మందమైన దుస్తులు ఉతకడానికి ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది.
అలాగే మృదువైన దుస్తులు త్వరగా ఉతికేస్తూ ఉంటుంది. ఆటోమెటిక్ వాషింగ్ మిషన్లు దుస్తుల ప్రకారం వేరువేరు ప్రోగ్రాములు కలిగి ఉంటుంది. అయితే తప్పు ప్రోగ్రాంని ఎంచుకోవడం వలన కొన్నిసార్లు బట్టలు మురికి పోవు కావున దుస్తుల తీరుకు అనుగుణంగా మిషన్ ప్రోగ్రామ్ ని పెట్టుకోవాలి. దీనికి మూలంగా బట్టల పౌడర్ కూడా చాలా తక్కువ పడుతుంది. నీరు కూడా తక్కువ పడుతుంది. మెషన్లో దుస్తులు ఉతకడానికి వేసినప్పుడు ఎక్కువ మురికి బట్టలు వేరువేరుగా.. తక్కువ మురికి బట్టలు వేరువేరుగా వేసుకుంటూ ఉంటే మంచిది. తక్కువ మురికి ఉన్న దుస్తులు ఉతకడానికి తక్కువ టైం.. తక్కువ నీళ్లు తీసుకుంటుంది. కావున మిషన్ తక్కువ టైం ని కేటాయించాలి. అదే టైంలో ఎక్కువ మాసిన దుస్తులను ఎక్కువ టైం తో పాటు ఎక్కువ నీటిని తీసుకోవడం చాలా అవసరం.. ఈ విధంగా చేస్తూ ఉంటే తక్కువ డిటర్జెంట్ తో బట్టలు మెరిసిపోతాయి…