Water Heater : మీరు వాటర్ హీటర్ వాడుతున్నారా.? అయితే ఇది తెలుసుకోకపోతే ఇక అంతే..?
Water Heater : శీతకాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడంలో ఒక విధమైన వినోదం ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో వాటర్ హీటర్ ను కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. హీటర్ తో నీటిని వేడి చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. లేదంటే చిన్న తప్పులే పెద్ద ప్రమాదానికి దారి తీస్తూ ఉంటాయి. అయితే ఈ వాటర్ హీటర్ వినియోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.. నీటిని వాటర్ హీటర్ తో వేడి […]
Water Heater : శీతకాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడంలో ఒక విధమైన వినోదం ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో వాటర్ హీటర్ ను కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. హీటర్ తో నీటిని వేడి చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. లేదంటే చిన్న తప్పులే పెద్ద ప్రమాదానికి దారి తీస్తూ ఉంటాయి. అయితే ఈ వాటర్ హీటర్ వినియోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.. నీటిని వాటర్ హీటర్ తో వేడి చేసేటప్పుడు నీరు వేడి ఆయ్యిందా.. లేదా.. అని చెక్ చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు స్విచ్ ఆన్ లో ఉన్నప్పుడు అలాంటి పనులు చేయొద్దు.. స్విచ్ ఆఫ్ లో ఉన్నప్పుడే నీటిని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అలా స్విచ్ ఆన్ లో ఉన్నప్పుడు కరెంట్ షాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతనే నీటిని చెక్ చేసుకోవడం మంచిది. అలాగే చూడడానికి హీటర్ రాడ్ మంచిగానే అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల తరబడి వినియోగిస్తే అది కొన్ని అంతర్గత ప్రాబ్లమ్స్ వచ్చి షాక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటర్ హీటర్ ను రెండు సంవత్సరాలు కంటే ఎక్కువగా ఉపయోగించకూడదు.. వాటర్ హీటర్ ను వాడేటప్పుడు నీటిలోకి ఎంత పంపాలో దానిపై గుర్తు ఉంటుంది. ఆ గుర్తు వెళ్లే వరకు నీటిలో ఉంచాలి. అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో దీంతో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ వాటర్ హీటర్ పెట్టిన బకెట్ వద్దకు వారు వెళ్లకుండా చూసుకోవాలి. ఒక రూమ్లో హీటర్ పెట్టిన బకెట్ ఉంచి డోర్ లాక్ చేస్తే ఎటువంటి ప్రమాదం జరగదు.
ప్లాస్టిక్ బకెట్ వాటర్ హీటర్ వేడికి కరగకుండా ఉండడానికి దానికి చెక్క కర్రను జోడిస్తే మంచిది. అలాగే నీటిని వేడి చేసేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత 10 సెకండ్ల తర్వాత నీటిలోంచి బయటికి తీయాలి. అలాగే ఇనుము లేదా స్టీల్ బకెట్లలో హీటర్ తో నీటిని ఇప్పుడు వేడి చేయకూడదు. ఇది ప్రమాదకరమైన విద్యుత్ షాక్ కు గురవుతుంది. కావున ఎప్పుడైనా ప్లాస్టిక్ మాత్రమే వినియోగించాలి. మీకు వాటర్ హీటర్ పై పూర్తిగా అవగాహన ఉంటేనే వాడాలి. లేదంటే వేడి నీటి కోసం లేదా మీ యొక్క గ్యాస్ పై ద్వారా వేడి చేసుకోండి. దీనిలో ఉన్న రిస్క్ కూడా తక్కువే మరియు కరెంట్ బిల్లు తలనొప్పి కూడా ఉండదు.