Moong Sprouts : పరిగడుపున మొలకెత్తిన పెసర్లను తీసుకోండి… ఈ సమస్యలకు చెక్ పెట్టండి…
ప్రధానాంశాలు:
Moong Sprouts : పరిగడుపున మొలకెత్తిన పెసర్లను తీసుకోండి... ఈ సమస్యలకు చెక్ పెట్టండి...
Moong Sprouts : ఉదయాన్నే ఖాళీ కడుపుతో మొలకెత్తిన పెసలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఈ మొలకెత్తిన పెసర్ల లో యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్,విటమిన్ సి అనేది అధిక మోతాదులో ఉంటాయి. ఈ మొలకెత్తినటువంటి పెసలను మన బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాక ఇది మన శరీరాన్ని నిర్వేషికరణ చేసేందుకు కూడా ఎంతో సహాయం చేస్తుంది.అంతేకాక జీర్ణ వ్యవస్థను కూడా ఎంతో బలోపెతం చేస్తుంది. ఈ మొలకెత్తిన పెసలు లో ఐరన్ అధికంగా ఉంటుంది. అలాగే మన శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం కూడా పెరుగుతుంది. దీని వలన రక్త హీనత సమస్య అనేది తగ్గుతుంది.ఈ మొలకెత్తిన పెసల లో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థను బలంగా చేయడానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఎసిడిటీ, కడుపునొప్పి లాంటి జీర్ణ సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది.ఇది జీవక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది.అంతేకాక చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మొలకెత్తిన పెసర్లతో రక్త ప్రసరణ అనేది ఎంతో మెరుగ్గా ఉంటుంది. అలాగే రక్తం గడ్డ కట్టే సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది అని పరిశోధకులు తెలిపారు…
ఈ పెసరపప్పులో మన శరీరానికి ఎంతో అవసరమైనా అమైనో ఆమ్లాలు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. అంతేకాక దీనిలో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ కూడా దీనిలో ఉన్నాయి. ఈ పెసరపప్పు అనేది అలసటను పోగొట్టేందుకు మరియు మంచి నిద్రకు ఎంతో మేలు చేస్తుంది. వీటితోపాటు మొలకెత్తిన పెసర గింజలను కూడా తినవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఈ మొలకెత్తిన పెసరపప్పును తీసుకోవటం వలన ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.మొలకెత్తినటువంటి ఈ పెసర పప్పు చర్మ సంరక్షణకు కూడా ఎంతో మేలు చేస్తుంది…
ప్రతినిత్యం ఉదయాన్నే మొలకెత్తిన పెసరపప్పులను తీసుకోవడం వలన మన చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మొలకెత్తిన పెసలను తీసుకోవడం వలన వృద్ధాప్య ఛాయాలను కూడా దూరం చేస్తుంది. అలాగే మన చర్మాన్ని యవ్వనంగా ఉంచేలా సహాయం చేస్తుంది. ఈ మొల కెత్తిన పెసల లో విటమిన్ ఏ అనేది అధికంగా ఉంటుంది. ఇది మన కళ్ళకు ఎంతో మేలు చేస్తుంది.దీనిని మన రోజు వారి ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే కంటి చూపు ఎంతో మెరుగుపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ మొలకెత్తిన పెసలు ఎంతో మంచిది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నది. ప్రతిరోజు గొప్పెడు వీటిని తీసుకున్నట్లయితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే శరీర లోపలి భాగాలను ఎంతో శక్తివంతం చేస్తుంది. ఈ మొలకెత్తిన పెసర్లు గర్భిణీలకు కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. అంతేకాక అధిక బరువుతో ఇబ్బంది పడే వారికి ఈ మొలకెత్తిన పెసర్లు బరువు తగ్గేందుకు ఎంతో సహాయం చేస్తుంది. అలాగే శరీరంలో కొవ్వు పెరగకుండా కూడా చూస్తుంది….