NTR : ఎన్టీఆర్ బర్త్ డే కు ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయంటే..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

NTR : ఎన్టీఆర్ బర్త్ డే కు ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయంటే..!!

 Authored By ramu | The Telugu News | Updated on :18 May 2025,3:00 pm

NTR : మే 20 అంటే నందమూరి అభిమానులకు పెద్ద పండగ. దీనికి కారణం ఆ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడం. ప్రతి ఏడాది మే 20 అభిమానులు ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా జరుపుతుంటారు. అలాగే ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త చిత్రాల తాలూకా అప్డేట్స్ కూడా మేకర్స్ తెలిపి అభిమానులను ఖుషి చేస్తుంటారు. ఈ ఏడాది కూడా అలాంటి అప్డేట్స్ రాబోతున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ భారీ పాన్-ఇండియా సినిమా ‘వార్ 2’ లో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ను మే 20 న విడుదల చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో హింట్స్ వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొత్త లుక్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో మెప్పించనున్నారు.

NTR ఎన్టీఆర్ బర్త్ డే కు ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయంటే

NTR : ఎన్టీఆర్ బర్త్ డే కు ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయంటే..!!

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘NTRNEEL’ (ఎన్టీఆర్ 31) నుండి గ్లింప్స్ రావచ్చన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎటువంటి వీడియో గానీ, ఫస్ట్ లుక్ గానీ విడుదల కాలేదు. సో బర్త్ డే కు ఖచ్చితంగా అప్డేట్ వస్తుందని ఉహించుకుంటున్నారు. కాకపోతే ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు నెమ్మదిగా జరుగుతుండటంతో ఆ చిత్రానికి సంబంధించి అప్డేట్స్ రావాలంటే కొద్దీ నెలలు వేచి చూడాల్సి ఉంటుంది అని మరికొంతమంది అంటున్నారు. చూద్దాం ఏంజరుగుతుందో..!!

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది