WhatsApp : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్… సైలెంట్ గా, ఫుల్ ప్రైవసీతో బయటపడవచ్చు…
WhatsApp : ప్రస్తుతం వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ లేదు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు అర్ధరాత్రి దాకా కూడా ప్రతి ఒక్కరు వాట్సాప్ ను చూస్తారు. ఎవరేం చేస్తున్నారు, ఎక్కడున్నారు, వారి స్టేటస్ ఏంటి, అలా ఎందుకు పెట్టారు, ఇలా చేశారేంటి ఇంకా ఎన్నో చర్చలు ఇవన్నీ ఒకటైతే, గ్రూపుల్లో మరో సందడి.. ఫ్రెండ్స్ గ్రూప్, ఆఫీస్ గ్రూప్, పొలిటికల్ గ్రూప్ ఇంకా ఎన్నో గ్రూప్స్ లలో విషయాలను పంచుకుంటారు. అయితే వాట్సాప్ గ్రూపులో అసౌకర్యం కలిగించే విషయం ఏమిటంటే అవసరం లేకపోయినా,ఇష్టం లేకపోయినా గ్రూపులో కొన్నిసార్లు కొనసాగించాల్సి ఉంటుంది. కొన్ని వీడియోలు, మెసేజ్లు మనకు చిరాకు పుట్టిస్తుంటాయి. ఒకవేళ ఎగ్జిట్ అయితే అందరికీ తెలిసిపోతుంది.
ఇంకా మనం చేసే చాట్లను కూడా స్క్రీన్ షాట్ తీసుకుని సదుపాయం ఉంది. దీనివల్ల గోప్యత అనేది అంతగా ఉండదు. అలాంటి వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ని తీసుకొస్తుంది. ఏదైనా గ్రూపులో కొనసాగడం ఇష్టం లేకపోతే సైలెంట్ గా ఎవరికి తెలియకుండా బయటపడవచ్చు. వాట్సాప్ యూజర్ లో ప్రైవసికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ గురించి మంగళవారం ప్రకటించింది. వాట్సాప్ వాడేవారు ఎవరికి తెలియకుండా సైలెంట్ గా బయటపడవచ్చు. అలాగే వారు ఆన్లైన్లో ఉన్నప్పుడు ఎవరు చూడవచ్చు, ఎవరు చూడకూడదు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్లను తీయకుండా వాట్సాప్ లో నివారించవచ్చు.
వాట్సాప్ లో అలా బ్లాక్ చేసే సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మేటా వ్యవస్థాపకుడు సీఈవో మార్క్ జూకర్బర్గ్ ప్రకటించారు. ఈ కొత్త ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వడం వ్యూ వన్స్ మెసేజెస్ లను స్క్రీన్ షాట్ తీయకుండా నిరోధించే సదుపాయం వల్ల ఇద్దరి మధ్య జరిగిన చాట్ కు అదనపు సెక్యూరిటీ కల్పించినట్లు అవుతుందని జుకర్ బర్గ్ తెలిపారు. మెసేజెస్ ను రక్షించడానికి కొత్త మార్గాలను రూపొందిస్తూనే ఉంటామని మేటా వ్యవస్థాపకుడు సీఈవో జూకర్ బర్గ్ తెలిపారు. ఈ కొత్త ఫ్యూచర్ వినియోగదారులందరికీ ఈ నెలలోపు అందుబాటులోకి రావచ్చని ఆయన తెలిపారు.