Whatsapp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ కనిపించకపోయిన చాట్ చేయోచ్చు..!
ప్రధానాంశాలు:
whatsapp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ కనిపించకపోయిన చాట్ చేయోచ్చు..!
Whatsapp : వాట్సాప్ అనేక సెక్యూరిటీ ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా వాట్సాప్‌లో ప్రస్తుతం కాంటాక్ట్ నంబర్ ఆధారంగా ఇతరులతో చాట్, కాల్స్ చేస్తున్నాం. అయితే త్వరలో వాట్సాప్‌లో యూజర్ నేమ్ ఫీచర్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఈ ఫీచర్‌తో వాట్సాప్ యూజర్లు తమ ఫోన్ నంబర్‌ను హైడ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

Whatsapp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ కనిపించకపోయిన చాట్ చేయోచ్చు..!
whatsapp : కొత్త ఫీచర్..
వాట్సాప్‌లో ఫోన్ నంబర్‌లకు బదులుగా యూజర్ల నేమ్ ద్వారా కాంటాక్ట్ కావచ్చు. వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ వివరాల ఆధారంగా ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉంది. వాట్సాప్ యూజర్ నేమ్ లో అక్షరాలు, సంఖ్యలు, అండర్‌స్కోర్‌లను మాత్రమే అనుమతిస్తుంది. వాట్సాప్ ధ్రువీకరించాక.. యూజర్ నేమ్ అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా ఈ ఫీచర్ గ్రూప్ చాట్ సహా కొత్త వ్యక్తులతో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించినప్పుడు ఉపయోగపడుతుంది.
అయితే ఇప్పటికే అనేక మంది యూజర్ల వద్ద మీ ఫోన్ నంబర్ ఉంటుంది. అలాంటి చోట్ల ఈ యూజర్ నేమ్ ఫీచర్ ఉపయోగపడే అవకాశం లేదు. కొత్త వ్యక్తులు మీతో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నం చేసినప్పుడు, మీ ఫోన్ నెంబర్ వారికి కనపించకుండా ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ బీటా టెస్టింగ్ దశలో ఉందని వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ తెలిపింది. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై క్లారిటీ లేదు.