Whatsapp : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్స్.. వాట్సాప్ ప్లే బ్యాక్ స్పీడ్ ఎలా పెంచాలి అంటే..!
Whatsapp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్స్‌తో అలరిస్తుంది. వాయిస్ మెసేజింగ్‌లో ప్రధానంగా నూతన సదుపాయాలను తీసుకొచ్చింది వాట్సాప్. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లకు ఈ ఫీచర్లు వచ్చాయి. చాట్‌లో నుంచి బయటికి వెళ్లినా వాయిస్ మెసేజ్‌లను వినేలా, వాయిస్ మెసేజ్‌ను పంపే ముందు ప్రివ్యూ ద్వారా చెక్ చేసుకునేలా, వాయిస్ రికార్డింగ్‌ను పాజ్, రిజ్యూమ్ చేసుకునే ఫీచర్లు యాడ్ అయ్యాయి. అలాగే వాయిస్ మెసేజ్‌ను సాధారణ స్పీడ్‌తో పాటు 1.5, 2 రెట్ల వేగంతోనూ వినవచ్చు. వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ ఫీచర్ చాలా పాపులర్. చాటింగ్ బదులు వాయిస్ మెసేజ్ పంపిస్తే చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పొచ్చు. అందుకని చాలామంది ఈ ఫీచర్ ఉపయోగిస్తుంటారు. యూజర్ల కంఫర్ట్ కోసం వాయిస్ మెసేజ్‌లో కొత్త ఫీచర్లు తెచ్చింది వాట్సాప్. వాయిస్ మెసేజ్ రికార్డింగ్, షేరింగ్ మరింత ఈజీ చేస్తాయి ఈ ఫీచర్లు.
ఇప్పటివరకు వాయిస్ మెసేజ్ వినాలంటే చాట్‌లోకి వెళ్లాలి. అయితే, చాట్ ప్లే బ్యాక్ కొత్త ఫీచర్ సాయంతో ఇకపై చాట్ నుంచి బయటికి వచ్చాక కూడా వాయిస్ మెసేజ్ వినొచ్చు. దాంతో, వాయిస్ మెసేజ్ వింటూనే మెసేజ్‌లు చూస్తూ, రిప్లయ్ ఇవ్వొచ్చు. పాజ్/ రెజ్యూమ్ ఉపయోగం ఏంటంటే వాయిస్ మెసేజ్ రికార్డ్ చేసేటప్పుడు కొన్నిసార్లు అన్ని విషయాలు గుర్తుకు రావు. దాంతో, రెండు మూడు సార్లు వాయిస్ మెసేజ్ పంపాల్సి వస్తుంది. అయితే ఇకనుంచి ఆ సమస్య ఉండదు. వాయిస్ మెసేజ్ రికార్డింగ్‌ని మధ్యలోనే ఆపేయొచ్చు. ఆలోచించుకున్న తర్వాత మళ్లీ మెసేజ్ రికార్డింగ్‌ని రెజ్యూమ్ చేయొచ్చు.ఫాస్ట్ ప్లే బ్యాక్ వలన వాయిస్ మెసేజ్‌ని మామూలు స్పీడ్‌లో వింటాం. ఇప్పుడు 1.5 టైమ్స్, 2 టైమ్స్ స్పీడ్‌లో కూడా వినొచ్చు. ఫార్వర్డ్ వాయిస్ మెసేజ్లని కూడా ఈ స్పీడ్‌లో వినొచ్చు.
Whatsapp : సరికొత్త ఫీచర్స్..
రిమంబర్ ప్లే బ్యాక్ ద్వారా చాట్ నుంచి బయటికి వస్తే, మళ్లీ మొదటి నుంచి వాయిస్ మెసేజ్ వినాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు వాయిస్ మెసేజ్‌ని పాజ్ చేయొచ్చు. అంతేకాదు పాజ్ చేసిన
వాయిస్ మెసేజ్‌ని ఆపేసిన దగ్గర నుంచి వినొచ్చు. ఈ కొత్త వాయిస్ మేసెజింగ్ ఫీచర్లు యూజర్లకు క్రమంగా వస్తున్నాయి. ప్రస్తుతం కొందరికి కొన్ని ఫీచర్లే యాడ్ కాగా.. రానున్న వారాల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ వస్తాయి.మరోవైపు మల్టిపుల్ లింక్డ్ డివైజెస్ ఫీచర్‌ను కూడా బీటా యూజర్లకు వాట్సాప్ అందించింది. స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్ ఖాతా ఆన్‌లైన్‌లో లేకున్నా లింక్ చేసిన కంప్యూటర్, ల్యాప్‌టాప్ నుంచి వాట్సాప్‌ను వాడుకునేలా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఫోన్‌లో ఇంటర్నెట్ ఆన్‌లో లేకున్నా ఇది వరకే లింక్ చేసిన డివైజ్ నుంచి మెసేజ్‌లు పంపవచ్చు.. రిసీవ్ చేసుకోవచ్చన్న మాట.