YS Sharmila : వైఎస్ షర్మిల పార్టీ వెనుక ఉన్నది ఎవరు..? బయటపడ్డ షాకింగ్ నిజాలు?
YS Sharmila : వైఎస్ షర్మిల అసలు తెలంగాణలో ఎందుకు పార్టీ పెడుతున్నారు? అసలు కారణం ఏంటి? అనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. తన రాష్ట్రం ఏపీ వదిలేసి.. తెలంగాణలో ఆమె పార్టీ పెడుతున్నదని తెలియగానే…. ముందు అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత మిగితా పార్టీలన్నీ వెంటనే సర్దుకున్నాయి. తమ పార్టీల్లోని నేతలను షర్మిల పార్టీలోకి వెళ్లకుండా ఉండేందుకు వెంటనే దిద్దుబాటు చర్యలను ప్రారంభించాయి.
అయితే… షర్మిల కూడా తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు విషయంపై కూడా షర్మిల.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. బీజేపీని తప్పు పట్టడంతో… బీజేపీ రివర్స్ లో షర్మిలపైకి తమ బాణాన్ని విసిరింది.
YS Sharmila : ఖమ్మంలో షర్మిల సభకు అనుమతిని ఇప్పించిందే కవిత?
అయితే.. షర్మిల బీజేపీని విమర్శిస్తుంటే… బీజేపీ నేతలు ఊరుకోరు కదా. వెంటనే బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ…. పసుపు బోర్డు విషయం గురించి తాను కేంద్రంతో మాట్లాడుతానన్నారు.
అయితే.. పసుపు బోర్డు విషయమై ప్రశ్నిస్తున్న షర్మిల… తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు పసుపు బోర్డు తీసుకురాలేదు? అని ప్రశ్నించారు. ఎప్పుడైనా వైఎస్సార్ పసుపు బోర్డు గురించి స్పందించారా? అని షర్మిలను నిలదీశారు.టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో షర్మిలకు లోపాయకారి ఒప్పందం ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో ఖమ్మంలో జరగబోయే షర్మిల సభకు అనుమతిని ఇప్పించిందే కవిత. అంటూ ఆయన షాకింగ్ నిజాలు బయటపెట్టారు.
కేవలం కవితను ప్రసన్నం చేసుకోవడం కోసమే…. కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ లో పసుపు బోర్డు విషయాన్ని లేవనెత్తారని.. నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో జానారెడ్డిని గెలిపించడం కోసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డి, రాములు నాయక్… ఇద్దరినీ బలిపశువులను చేశారని ప్రభాకర్ దుయ్యబట్టారు.సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు… జానారెడ్డిని గెలిపించడం కృషి చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ కూతురు వాణీదేవిని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ గెలిచింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ కూతురు షర్మిలను అడ్డం పెట్టుకొని గెలవాలని టీఆర్ఎస్ ప్లాన్ వేసింది… అంటూ ప్రభాకర్ వ్యాఖ్యానించారు.