Devineni Uma : అందరూ కలిసి దేవినేని ఉమా నెత్తిన పిడుగు వేశారుగా..!
Devineni Uma : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇప్పుడు పెద్ద తలనొప్పి వచ్చి చేరింది. వచ్చే ఎన్నికల్లో దేవినేనిని గుడివాడ నుంచి పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. నిజానికి దేవినేని ఉమది మైలవరం నియోజకవర్గం. కానీ.. గుడివాడ నుంచి చంద్రబాబు చెప్పడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఎందుకంటే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీకే పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. ఆయన వల్ల టీడీపీకి చాలా చెడ్డ పేరు వస్తోంది. […]
Devineni Uma : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇప్పుడు పెద్ద తలనొప్పి వచ్చి చేరింది. వచ్చే ఎన్నికల్లో దేవినేనిని గుడివాడ నుంచి పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. నిజానికి దేవినేని ఉమది మైలవరం నియోజకవర్గం. కానీ.. గుడివాడ నుంచి చంద్రబాబు చెప్పడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఎందుకంటే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీకే పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. ఆయన వల్ల టీడీపీకి చాలా చెడ్డ పేరు వస్తోంది. టీడీపీ పరువును గంగలో కలపాలంటే కొడాలి తర్వాతనే ఎవరైనా? కొడాలిని ఓడించాలని.. గుడివాడలో కొడాలి నాని గెలవకూడదని చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు కానీ.. అవి సాధ్యం కాలేదు. 2014, 2019 రెండు ఎన్నికల్లో కొడాలి గెలిచారు.
అందుకే వచ్చే ఎన్నికల్లో అయినా కొడాలి నానిని ఓడించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. కొడాలి కంటే ముందు వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా ఓడించాలని చంద్రబాబు టార్గెట్ చేసుకున్నారు. ముఖ్యంగా కొడాలి నాని.. చంద్రబాబుతో పాటు ఆయన కొడుకు నారా లోకేశ్ పై కూడా పలు ఆరోపణలు చేస్తుండటం, పబ్లిక్ గా లోకేశ్ ను టార్గెట్ చేయడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకే.. వచ్చే ఎన్నికల్లో అయినా కొడాలిని ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు.
Devineni Uma : కొడాలిని ఓడించే సత్తా దేవినేని ఉమకే ఉందా?
2024 ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించే దమ్ము ఎవరికి ఉంది అని తెగ ఆలోచించిన చంద్రబాబుకు దొరికిన ఒకే ఒక అస్త్రం దేవినేని ఉమ. ఈ విషయంపై చంద్రబాబు పలువురు టీడీపీ నేతలతో చర్చించి చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారట. కొడాలికి దీటైన అభ్యర్థి దేవినేని ఉమే అని ఫిక్స్ అయ్యారట చంద్రబాబు. అందుకే.. ఈసారి మైలవరం నుంచి కాకుండా గుడివాడ నుంచి పోటీ చేయాలని చంద్రబాబు.. దేవినేని ఉమకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే.. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. దేవినేని ఉమ ఒరిజినల్ నియోజకవర్గం నందిగామ. దగానీ.. నందిగామ ఎస్సీ రిజర్వుడు కావడంతో దేవినేని ఉమకు మైలవరాన్ని కేటాయించారు చంద్రబాబు. ఇప్పుడు మైలవరం కాదని గుడివాడ అంటే దేవినేని ప్రజల మద్దతును కూడగట్టుకోగలరా? ఈ పరిస్థితుల్లో కొడాలి నానిపై పోటీ చేసి దేవినేని గెలుస్తారా? అనేది మాత్రం డౌటే.. అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?