TDP : మైలవరం , పెనమలూరులో వేడెక్కుతున్న రాజకీయాలు… సందిగ్ధంలో చంద్రబాబు నాయుడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TDP : మైలవరం , పెనమలూరులో వేడెక్కుతున్న రాజకీయాలు… సందిగ్ధంలో చంద్రబాబు నాయుడు..!

TDP : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేల ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఆసక్తికరంగా మారుతున్నాయి.అనేక రకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా కృష్ణాజిల్లాలో మైలవరం నియోజకవర్గం ఆంధ్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుండి టికెట్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇప్పటికే టీడీపీ టచ్ లోకి వెళ్లిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమా మధ్య టఫ్ ఫైట్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :26 February 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  TDP : మైలవరం , పెనమలూరులో వేడెక్కుతున్న రాజకీయాలు... సందిగ్ధంలో చంద్రబాబు నాయుడు..!

TDP : ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేల ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు తీవ్ర ఆసక్తికరంగా మారుతున్నాయి.అనేక రకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా కృష్ణాజిల్లాలో మైలవరం నియోజకవర్గం ఆంధ్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుండి టికెట్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇప్పటికే టీడీపీ టచ్ లోకి వెళ్లిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాజీ మంత్రి దేవినేని ఉమా మధ్య టఫ్ ఫైట్ ఉంది .టికెట్ తనది అంటే తనది అంటూ పోటీపడి ప్రకటనలు చేసుకుంటున్నారు. మైలవరంలో పోటీ చేయడానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ నియోజకవర్గ టీడీపీ నేతలకు వసంత కృష్ణ ప్రసాద్ ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. అభిప్రాయ బేధాలు ఉంటే కలిసి మాట్లాడుకుందాం అని చెబుతున్నట్లు తెలుస్తుంది . త్వరలో మైలవరం లోని టీడీపి నేతలతో వసంత సమావేశం అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే వసంత రాకను మాజీ మంత్రి దేవినేని ఉమా మరియు బొమ్మసాని సుబ్బారావు వ్యతిరేకిస్తున్నారు. దీంతో వారిద్దరితో చర్చలు జరిపేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఇక పెనమలూరు నియోజకవర్గం విషయానికొస్తే ఈ నియోజకవర్గ రాజకీయాలలో ట్విస్ట్ మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇక టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది కుడా క్లారిటీ లేదు. అయితే నిజానికి పెనమలూరు ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పెనమలూరు నియోజకవర్గం టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తనకే టికెట్ వస్తుంది అని చెప్పుకుంటున్నారు. అయితే అధిష్టానం మాత్రం మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది .అయితే అంతలోనే మైనార్టీ నేత ఎమ్మెస్ బేక్ పేరు సర్వే నిర్వహించడంతో టీడీపీ పార్టీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారధి తుమ్మల చంద్రశేఖర్ పేరును సిఫారసు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం మైనవరం మరియు పెనుమూరు రెండు చోట్ల హై వోల్టేజ్ రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో ముందుగా అసంతృప్తులను బుజ్జగించిన తర్వాత అభ్యర్థుల ప్రకటన చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినప్పటికీ కూడా మైలవరం మరియు పెనుమలూరు సీట్లను పెండింగ్ లో పెట్టడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఈ రెండు చోట్ల కూడా హై వోల్టేజ్ రాజకీయం కొనసాగుతుంది. ఎందుకంటే ఈ రెండు స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారు. అయితే అక్కడ టికెట్లకు సంబంధించిన ప్రకటన చేయడానికి అధిష్టానం ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అక్కడ టికెట్ల ప్రకటన చేసిన తర్వాత అసంతృప్తుల సెగ జ్వాల రగిలే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మైలవరం పెనమలూరు నియోజకవర్గాలలోని రెండు సీట్లలో ఏ విధంగా టికెట్లను ప్రకటన చేయాలి అభ్యర్థులను ఏ విధంగా బుజ్జగించాలి అనే అంశం ప్రస్తుతం అధిష్టానానికి సవాలుగా మారిన పరిస్థితి. అయితే ఇక్కడ మైలవరం నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇక్కడ పోటీ చేయడానికి సంబంధించి అన్ని రకాల ప్రయత్నాలకి సిద్ధపడుతున్నారు అని సమాచారం. అలాగే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో అక్కడ టికెట్ ఆశిస్తున్న వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమా మరియు బొమ్మసాని సుబ్బారావు వీళ్ళి ఇద్దరు కూడా ఉన్నారు.

అయితే ఇక్కడ టికెట్ వీరి ఇద్దరికీ లేకుండా వేరే వారికి అంటే వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కి టికెట్ కనుక కేటాయిస్తే భారీ ఎత్తున నిరసన తలెత్తుతుంది అని చెప్పాలి. కాబట్టి వారిద్దరిని కూడా ముందు బుజ్జగించి ఆ తర్వాత టికెట్టును ప్రకటన చేయాలి అనే అంశంపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ మండల కీలక నేతలకు ఫోన్ చేసి టచ్ లోకి వెళ్లారు. తనకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని కాబ్బటి మీరు నాతో కలిసి పని చేస్తే గతంలో ఉన్న విభేదాలు అన్నిటినీ కూడా సర్దుబాటు చేసుకుందామని ఆయన ఫోన్లో చెప్పినట్టు కూడా సమాచారం. ఇక పూర్తిస్థాయిలో మైలవరం అంశం అనేది చాలా సున్నితమైన అంశం కాబట్టి అందరం వేచి చూడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు టికెట్లు రాని నేతలను బుజ్జగించడానికి అధిష్టానం అన్ని రకమైన చర్యలు తీసుకుంటుంది అని తెలుస్తుంది. అయితే పెనమలూరు సంబంధించి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో దేవినేని ఉమా పేరు కూడా అక్కడ పరిశీలిస్తున్నారు.

అయితే వైసీపీ కి సంబంధించి పార్థసారథి కూడా టికెట్ ఆశించారు. అయితే ఆయనకు నూజివీడు టికెట్ నీ కేటాయించిన నేపథ్యంలో ఆయన వర్గానికి సంబంధించి మాజీ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ పేరుని పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ టికెట్ మీద అనేక పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు తన సన్నిహితుల పేర్లు పరిశీలిస్తున్న నేపథ్యంలో వేరే వారికి టికెట్ ఇస్తే కనుక బోడె వర్గం కూడా ఆందోళనకు దిగే అవకాశం ఉంది. కాబట్టి పెనమలూరు అంశాన్ని కూడా సున్నితంగా పరిశీలిస్తున్నారు. అయితే ఎమ్మెస్ బేక్ పేరును కూడా ఐవిఆర్ సర్వేలో పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే పెనుమలూరు మైలవరం ఈ రెండు టికెట్లు సంబంధించిన ప్రకటనకు అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాలలోని రాజకీయాలు పై వోల్టేజ్ తో నడుస్తున్నాయని చెప్పాలి. మరి ఈ రాజకీయ విశ్లేషణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది