అయ్యిందా.. బాగా అయ్యిందా – చంద్రబాబు నెత్తిన పిడుగు వేసిన అచ్చెన్నాయుడు
తన సొంత కొడుకు కంటే కూడా అచ్చెన్నాయుడు అంటేనే ఎక్కువగా నమ్ముతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అచ్చెన్నాయుడుని టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా నియమించకూడదు.. అని నారా లోకేశ్ చెప్పినా సరే.. చంద్రబాబు వినలేదు. చివరకు అచ్చెన్నాయుడినే టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా నియమించాడు. అంతే కాదు.. అచ్చెన్నాయుడికి పార్టీలో మరింత ప్రాముఖ్యత ఇస్తున్నారట. ఆయన ఎంత చెబితే అంత. ఆయన ఎవరికి ఏ పదవి ఇవ్వాలో చెబితే చంద్రబాబు మరు మాట కూడా మాట్లాడటం లేదట. అచ్చెన్నాయుడు విషయంలో చంద్రబాబు చేస్తున్న విషయాలు టీడీపీ శ్రేణులకే అంతుపట్టడం లేదంటూ వార్తలు వస్తున్నాయి.
సేమ్.. ఉత్తరాంధ్రలో కూడా చంద్రబాబు.. అచ్చెన్నాయుడు చెప్పిన వాళ్లకే పదవులను ఇచ్చారట. అసలే టీడీపీ పరిస్థితులు బాగా లేవు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందో? లేదో? కూడా డౌటే. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సమయంలో పార్టీలో ఒకరిద్దరిని మాత్రమే నమ్ముకొని పార్టీని ముందు సాగిస్తే.. గుడ్డిగా వాళ్లు ఏది చెబితే అదే చేస్తే ఎలా? ఇలా అయితే పార్టీ మీద సొంత పార్టీ నేతలకే నమ్మకం పోతుంది కదా.. అంటూ టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
యువతను ఎంకరేజ్ చేయని చంద్రబాబు?
పార్టీలోకి కొత్త రక్తం రావాలని.. యువత పార్టీలోకి రావాలని.. ఏదో పైకి చెబుతున్నా.. లోపల మాత్రం సీనియర్ నేతలకే చంద్రబాబు పదవులను కట్టబెడుతున్నరని.. అచ్చెన్నాయుడుని గుడ్డిగా చంద్రబాబు నమ్మితే ఏం జరుగుతుందో త్వరలోనే తెలుస్తుందని.. దీని ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుందని.. ఇప్పటికైనా చంద్రబాబు పార్టీ మీద సరిగ్గా దృష్టి పెట్టాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నారు.
లేదంటే పార్టీని మూసుకోవాల్సిందేనని.. ఓవైపు వైసీపీ.. మరోవైపు బీజేపీ.. రెండు పార్టీలను ఎదుర్కోవాలంటే పార్టీలోకి యువతను తీసుకురావాలని.. సరికొత్త నిర్ణయాలు తీసుకోవాలని.. ఆదిశగా చంద్రబాబు ప్రోత్సాహం అందించాలి కానీ.. అచ్చెన్నాయుడినే గుడ్డిగా నమ్మడం ఏంటో. ఇది ఎంత దూరం వెళ్తుందో అని సొంత పార్టీ నేతలే తెగ టెన్షన్ పడుతున్నారు.