Chandrababu : మళ్ళీ సొంత క్యాడర్ కి దెబ్బ వేసిన చంద్రబాబు .. అయోమయం అంధకారం ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : మళ్ళీ సొంత క్యాడర్ కి దెబ్బ వేసిన చంద్రబాబు .. అయోమయం అంధకారం !

 Authored By kranthi | The Telugu News | Updated on :15 April 2023,4:00 pm

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనకు ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి నిరసన వ్యక్తం అయింది. అది పక్కన పెడితే చంద్రబాబు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న టీడీపీ నేతల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు. గుడివాడ, నూజివీడు, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోకి టీడీపీ నాయకుల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. దీనిపై చంద్రబాబు ఎలాంటి పరిష్కారం చూపించలేకపోతున్నారు.

why chandrababu has no clarity on gudivada tdp candidate

why chandrababu has no clarity on gudivada tdp candidate

నిజానికి.. చంద్రబాబు వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయా నియోజకవర్గాల నేతలు భావించారు. కానీ.. చంద్రబాబు వచ్చినా పరిష్కారం మాత్రం దొరకడం లేదంటున్నారు. దానికి ప్రధాన కారణం.. అసలు టికెట్ ఎవరికి వస్తుందనేది. గుడివాడలో టికెట్ ఎవరికి ఇస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ ఈ ఉమ్మడి కృష్ణా పర్యటనలో పలు నియోజకవర్గాలకు సంబంధించి చంద్రబాబు టికెట్లు ప్రకటిస్తారని అంతా భావించారు కానీ.. టికెట్ గురించి అసలు ఏమాత్రం మాట్లాడలేదు.

Chandrababu why tdp not filed case on go one in ap high court

Chandrababu why tdp not filed case on go one in ap high court

Chandrababu : తారాస్థాయికి చేరుకున్న వర్గ పోరు

వచ్చే సంవత్సరం ఈ సమయం వరకు ఎన్నికలు రానున్నాయి. ఈనేపథ్యంలో టీడీపీకి కీలకమైన ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వర్గ పోరు తారా స్థాయికి చేరుకోవడంతో చంద్రబాబుకు ఏం చేయాలో అర్థం కావడం లేదట. ఎలాగూ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు కాబట్టి ఇక్కడి సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారని నేతలు అనుకున్నారు. టీడీపీ తమ్ముళ్లు అదే ఆశతో ఉన్నారు కానీ.. చంద్రబాబు అసలు ఆ ఊసే ఎత్తకుండా తన పర్యటనను చకచకా ముగించేసుకుంటున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది