వృద్ధాప్యంలో పిల్లలు మనల్ని ఎందుకు వదిలేస్తారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

వృద్ధాప్యంలో పిల్లలు మనల్ని ఎందుకు వదిలేస్తారు..!

పిల్లలు వృద్ధాప్యంలోమిమ్మలిని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతుంటారు. సీఎం అయినా పియాం అయిన ఎవరైనా కూడా ఇలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఇలా ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారో ఇప్పుడు మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.. ఒక అడవిలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు మీదే రోజు కొన్ని వేల సంఖ్యలో పక్షులు నివసించేవి. చాలా పక్షులు అక్కడికి వచ్చి ఆ చెట్టు మీదే విశ్రాంతి తీసుకునేవి.. పక్షులు ఆ చెట్టుపై ఉంటూ […]

 Authored By aruna | The Telugu News | Updated on :23 September 2023,2:00 pm

పిల్లలు వృద్ధాప్యంలోమిమ్మలిని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతుంటారు. సీఎం అయినా పియాం అయిన ఎవరైనా కూడా ఇలా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఇలా ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారో ఇప్పుడు మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం.. ఒక అడవిలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు మీదే రోజు కొన్ని వేల సంఖ్యలో పక్షులు నివసించేవి. చాలా పక్షులు అక్కడికి వచ్చి ఆ చెట్టు మీదే విశ్రాంతి తీసుకునేవి.. పక్షులు ఆ చెట్టుపై ఉంటూ ఎనలేని ఆనందాన్ని పొందేవి. కొన్నాళ్లకు వర్షాలు సరిగా కురవడం మానేశాయి. కొద్దిరోజులకు అడవి పూర్తిగా ఎండిపోయింది. ఆ మర్రిచెట్టు కూడా ఎండి పోవడం ప్రారంభించింది. ఎండిపోవడంతో పక్షులన్నీ ఆ చెట్టును విడిచిపెట్టడం ప్రారంభించాయి. ఆ చెట్టుపై నివసించే పక్షులన్నీ దానిని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లిపోతాయి. కానీ ఒక్క ముసలి రాబందు మాత్రం ఆ చెట్టు మీద ఒక్కతే ఒంటరిగా కూర్చుని ఉంది. ఆ రాబందు కొన్ని పక్షులు ఆ ముసలి రా బందును అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని చెప్పాయి. కానీ ఆ రాబందు వెళ్లడానికి నిరాకరించింది. ముసలి రాబందు ఇలా చెప్పింది నేను ఈ చెట్టు మీద పుట్టాను.

ఈ చెట్టు మీదే ఆడుతూ దూకుతూ పెరగాను. ఈ చెట్టు నా జీవితంలో అన్ని ఆనందాలను ఇచ్చింది. ఈరోజు ఈ చెట్టుకు ఆపద వచ్చినప్పుడు నేను వదిలి ఒంటరిగా ఎలా వెళ్లగలను. ఈ చెట్టు నన్ను పెంచి పోషించింది. సంతోషంలోనూ, దుఃఖంలోనూ నన్ను ఆదరించింది. ఈ చెట్టుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. చనిపోయిన తర్వాత కూడా నేను చెప్పిన వదలను అని చెప్పింది.ఇక ఆరాబంధు కాస్త అటు ఇటు తిరుగుతూ సాయంత్రం మళ్ళీ అదే చెట్టు మీదకు వచ్చి కూర్చునేది కొద్ది రోజులకు మొత్తం పక్షులు అక్కడి నుంచి వెళ్లిపోయాయి.l ఈ చెట్టు జీవితం ముగిసిపోయింది. చనిపోయేవారితో చనిపోవడం ఎంతవరకు సమంజసం ఈ చెట్టు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. రాత్రి పగలు తేడా లేకుండా చెదలు ఆ చెట్టును నాశనం చేస్తున్నాయి. ఏదో ఒక రోజు అది బలమైన గాలితో కిందకు పడిపోతుంది. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు. మీరు ఈ చెట్టును విడిచిపెట్టి ఏదైనా మంచి ప్రదేశంలో మీ నివాసం ఏర్పాటు చేసుకోండి అని పక్షులు అన్నాయి. పక్షులు ఎంత చెప్పినప్పటికీ ఆ రాబందు ససేమిరా అని వాళ్లతో రాబందు ఇలా చెప్పింది.

నేను చనిపోయే వరకు ఈ చెట్టు మీదనే ఉంటాను. అని రాబందు చెప్పింది మీరు ఇక్కడి నుండి వెళ్ళిపొండి అని కూడా చెప్పింది. రాబందు మొండితనం చూసే పక్షులన్నీ నిరాశ చెందాయి. అలా మళ్లీ కొద్ది రోజులకి ఒప్పించడానికి మరికొన్ని పక్షులు మళ్ళీ వచ్చాయి. కానీ రాబందు మళ్ళీ వెళ్ళడానికి నిరాకరించింది. ఈసారి పక్షులన్నీ తమ ఇళ్లకు తిరిగి వెళ్ళలేదు. అవి నేరుగా ఇంద్రుని వద్దకు వెళ్లి కథ మొత్తం చెప్పేసాయి. ఓ దేవుడా మేము ఈ అడవిలో ఎప్పటినుంచో నివసిస్తున్నాము. ఇక్కడ వర్షాలు పడలేదు అడవి మొత్తం ఎండిపోయింది. మొక్కలు అన్ని ఎండిపోయాయి. అడవిలోని జంతువులని అడవిని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాయి. కానీ రాబందు మాత్రం వెళ్ళలేదు కానీ ఏదో ఒక రోజు కిందకు పడిపోయే స్థితి ఏర్పడింది. మేము వారిని ఒప్పించడానికి వెళ్ళాము కానీ వారు ఇప్పటికీ ఆ చెట్టును విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు. చనిపోయే వరకు ఆ చెట్టును వదలనని చెప్పింది. అని చెప్పాయి. అందుకే దేవుడా నువ్వే వెళ్లి అతని వివరించాలి.

Why do children leave us in old age

Why do children leave us in old age

బహుశా నీ మాటలను వింటాడేమో అని చెప్పాయి. ఇంద్రుడు ఆ పక్షుల కోరికను అంగీకరించాడు. మరియు ఇంద్ర దేవుడు పక్షులతో ఆ అడవికి వెళ్లి ఆ ముసలి రాబందుకు వివరించడం ప్రారంభించాడు. అంగీకరించాడు మరియు ఇంద్ర దేవుడు పక్షులతో ఆ అడవికి వెళ్లి ఆ ముసలి రా బందుకు వివరించడం ప్రారంభించాడు అయ్యా ఈ చెట్టు చాలా శిథిలావస్థకు చేరుకుంది దాని కొమ్మలు ఎండిపోయింది. మీరు వేరే ప్రాంతానికి వెళ్ళండి అని చెప్తాడు కానీ ఆ రాబందు ఆ చెట్టును దేవుడు కన్నా ఎక్కువగా చూస్తాను. నేను దీన్ని వదల్లేను అని చెప్తుంది. రాబందు మాటలు విన్న ఇంద్రుడు సంతోషించాడు. మరియు ఈ రోజు నేను మీకు ఒక వరం ఇవ్వాలి అనుకుంటున్నాను. నీకు ఏమి కావాలి చెప్పు అని అన్నాడు. ఓ దేవుడా ఇవ్వాలనుకుంటే నాకు వారం అవసరం లేదు.

ఈ మర్రిచెట్టుకు ఇవ్వండి. మళ్ళీ పచ్చగా మారేలా చెయ్యండి నేను సంతోషంగా ఉంటాను. అంది ఆ రాబందు. అది విన్న ఇంద్రుడు ఆ చెట్టును మళ్ళీ పచ్చగా చేశాడు. అడవి అంతా వర్షం కురిసింది. అడవిలోని చెట్లన్నీ మళ్ళీ పచ్చగా మారాయి. చుట్టుపచ్చదనం కనిపించింది. అడవిని వదిలి వెళ్ళిన జీవులు జంతువులు పక్షులు మళ్ళీ అదే అడవికి పక్షులన్నీ ఒకే మర్రిచెట్టు వద్దకు వచ్చి కిలకిల రావాలు చేయడం ప్రారంభించాయి. పక్షులన్నీ ఆ ముసలి రాబందు మామయ్యకు బాగా సేవ చేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా మీకు జన్మనిచ్చిన తల్లి మరియు మిమ్మల్ని పోషించిన తండ్రి కూడా మీకు ప్రాణదాత అని ఈ కథ నుండి మనం నేర్చుకోవాలి. నిన్ను పైకి తీసుకురావడానికి చాలా కష్టాలు పడ్డాడు వృద్ధాప్యంలో వారిని ఆదుకో లేకపోతే ఈ జీవితం వల్ల చాలా ప్రయోజనం ఉండదు.

Tags :

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది