40 ఏళ్లు దాటిన వారు ఈ జాగ్రత్తలు తీసుకుంటే వృద్దాప్యం దరి చేరదు
old age : ఒకప్పుడు వృద్దాప్యం అనేది 50 నుండి 60 ఏళ్ల తర్వాత వచ్చేది. కాని ఇప్పుడు ఆహారపు అలవాట్లు మరియు చేస్తున్న పనుల కారణంగా 40 ఏళ్లకే వృద్దాప్య చాయలు వస్తున్నాయి. 50 ఏళ్లకు ఏ పని చేయలేని వారిగా మారిపోతున్నారు. 40 ఏళ్ల వయసు ఆడ మరియు మగవారు జాగ్రత్తలు తీసుకుంటూ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వల్ల వృద్దాప్యం అనేది దరి చేరదు అంటూ నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల 60 శాతం వరకు వృద్దాప్యం రాదు అంటూ వారు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం పదండి..
old age : ఇలా చేయడం వల్ల వృద్దాప్యం దరి చేరదు…
వయసు పెరుగుతుంటే ఎముకలు బలహీనపడే అవకాశం ఉంటుంది. అందుకే ఎముకలు స్ట్రాంగ్ గా ఉండేందుకు ఎక్కువగా కాల్షియం ఇచ్చే ఆహారంను తీసుకోవాలి. పాలు మరియు పెరుగును ఎక్కువ తీసుకోవడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి.బచ్చలి కూరలో అధిక భాగం విటమిన్ సి ఉంటుంది. దాంతో పాటు యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి. వాటితో ఫ్రీరాడికల్స్ తొలగి పోయే అవకాశం ఉంది. తద్వార అవి వృద్దాప్యంను తొలగించే అవకాశం ఉంటుంది.అవిసె గింజలను తరచు ఆహారంలోకి తీసుకోవాలి. మహిళల హార్మోన్‌ల పనితీరుపై ఇవి బాగా పని చేస్తాయని నిపుణులు నిరూపించారు.
వీటిని ఎక్కువగా తినడం వల్ల మహిళల వృద్దాప్య ఛాయలు ఆలస్యంగా వస్తాయి.బ్లూ బెర్రీస్ లో అధిక భాగం విటమిన్ సి మరియు కె, మాంగనీస్ లు ఉండటం వల్ల కూడా శరీరంకు కావాల్సిన బలంతో పాటు మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. బ్లూ బెర్రీస్ మెదడు చురుకుగా పని చేస్తుంది.టమోటాలు, కోడిగుడ్లు, చిలగడ దంపలు, పుట్టగొడుగులు, రోజ్ ఆపిల్, బాధం పప్పు, పాలు, పలు రకాల పండ్లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అవయవాల పని తీరు పై వృద్దాప్యం వల్ల ప్రభావం పడకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నాఉ.