Kalvakuntla Kavitha : కవితను ఎందుకు టార్గెట్ చేశారు? కేసీఆర్ ను ఢీకొట్టేందుకు కవితను పావుగా వాడుకుంటున్నారా?
Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కుటుంబం గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా తెలుసు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన వాళ్లకు, తన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ పదవులను కట్టబెట్టారనేది జగమెరిగిన సత్యం. అందుతూ తన కూతురు కల్వకుంట్ల కవిత కూడా ఉంది. 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా గెలిచింది కవిత. 2014 నుంచి 2019 ఎన్నికల వరకు రాష్ట్రంలో చాలా యాక్టివ్ గా ఉంది. పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించింది. జాగృతి సంస్థను ఏర్పాటు చేసింది. తన తండ్రికి చేదోడువాదోడుగా ఉన్నారు కవిత. 2019 ఎన్నికల వరకు అంతా సజావుగానే సాగింది.
కానీ.. 2019 ఎన్నికల్లో ఎప్పుడైతే కవిత నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయారో అప్పటి నుంచి కవిత టార్గెట్ అయ్యారు. పసుపు బోర్డు విషయంతో కవితపై చాలా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత నిజామాబాద్ ఎంపీగా ఓడిపోవడంతో తను కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత తనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ పావులు కదపడం ప్రారంభించారు కవిత. అయితే.. కవితపై కావాలని ప్రతిపక్ష పార్టీల నేతలు బురద జల్లుతున్నారు అని టీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. కవిత.. వేరే పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తోంది అంటున్నారు. కానీ.
Kalvakuntla Kavitha : కవితను బదనాం చేసే కార్యాక్రమాన్ని బీజేపీ ఎందుకు చేపట్టింది?
కావాలని కవితను బదనాం చేస్తే సొంత తండ్రి కేసీఆర్.. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని భావించి ప్రతిపక్ష పార్టీల నేతలు ఇలా చేస్తున్నారా అనేది తెలియదు. పార్టీ పరంగా ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉండకపోవచ్చు. మరోవైపు తనపై ఉన్న లిక్కర్ స్కామ్ కూడా అటువంటిదే. కుంభస్థలాన్ని బద్ధలు కొట్టాలంటే కింది నుంచి నరుక్కుంటూ రావాలని బీజేపీ నేతలు భావిస్తున్నారా? అందుకే కవితను పావుగా వాడుకొని.. తనపై లేనిపోని విమర్శలు చేసి కేసీఆర్ ను ఢీకొట్టాలని చూస్తున్నారా? అందుకే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కవిత టార్గెట్ అయ్యారా అనేది తెలియాల్సి ఉంది.