Prakash Raj : రాజ్యసభకు పంపేంత సాయం కేసీఆర్ కు ప్రకాష్ రాజ్ ఏం చేసి ఉంటాడు?
Prakash Raj : తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేసినా కూడా రాజకీయంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాత్రమే చేస్తాడు అంటూ ఆయన సన్నిహితులు మరియు రాజకీయ వర్గాల వారు అంటూ ఉంటారు. రాజకీయంగా కలిసి వస్తుంది అనుకుంటేనే ఆయన ఏ పని అయినా చేస్తాడు అంటూ ఒక అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే చేస్తారు. కానీ కేసీఆర్ ఇంకాస్త ఎక్కువ ఆలోచిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయంగా కలిసి వస్తుంది అనుకుంటే కొన్నిసార్లు తగ్గడం.. కొన్నిసార్లు తొక్కేయడం.. కొన్నిసార్లు లేపడం.. లాంటివి చేయడం కేసీఆర్ నుండి చూశాం. ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలి అనేది బాగా తెలిసిన వ్యక్తి కేసీఆర్.కేంద్రంలో ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలి అనే విషయాలపై పూర్తి అవగాహణ ఉన్న వ్యక్తి కనుక ఇన్నాళ్లు చాలా సాఫీగా రాజకీయాన్ని నడుపుకుంటూ వచ్చాడు.
ఒకప్పుడు కాంగ్రెస్ తో లాలూచీపడిన కేసీఆర్ ఆ తర్వాత బిజెపికి సాహిత్యం గా ఉన్నాడు. మోడీని ఒకానొక సమయంలో గొప్ప నాయకుడు అంటూ పొగడ్తల్లో ముంచెత్తిన కేసీఆర్ ఇప్పుడు దెయ్యం అంటూ విమర్శిస్తున్నాడు అంటే అది ఖచ్చితంగా రాజకీయ వ్యూహంలో భాగమే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు మోడీకి వ్యతిరేక రాజకీయ శక్తిని తయారు చేయడం కోసం కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇటీవల మహారాష్ట్ర వెళ్లి ఉద్దవ్ ఠాక్రే ను కలవడం జరిగింది.ఇదే సమయంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ ని టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు పంపించేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు క్రియాశీలకంగా ఉండే ప్రకాష్ రాజ్ ఇటీవల మహారాష్ట్ర కు కేసీఆర్ తో కలిసి వెళ్లడం.. అక్కడు ఉద్దవ్ ఠాక్రే ను కలవడం జరిగింది. గత కొన్నాళ్లుగా టిఆర్ఎస్ కి దగ్గరగా ఉంటున్న కారణంగా ప్రకాష్ రాజ్ రాజ్యసభకు కేసీఆర్ సార్ సాయంతో వెళ్లబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ప్రకాష్ రాజ్ ని రాజ్యసభకు పంపించడం అంటే చాలా పెద్ద విషయం. ప్రకాష్ రాజ్ నుండి అత్యంత భారీ సహాయం పొందినట్లయితే నే కేసీఆర్ ఆయన్ను రాజ్యసభకు పంపించే అవకాశం ఉంటుంది. మరి ప్రకాష్ రాజ్ నుండి కేసీఆర్ అంత భారీ సహాయం ఏం పొంది ఉంటాడు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా ప్రకాష్ రాజు వల్ల ఏదైనా పెద్ద సహాయం దక్కే అవకాశం ఉంది ఏదైనా ఉంటుందేమో అని కేసీఆర్ భావిస్తున్నారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ క్రియాశీల రాజకీయ నాయకుడు కాదు. ఆయన కేవలం నటుడు మాత్రమే.. కానీ బిజెపికి వ్యతిరేకంగా మాత్రం పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా బిజెపిని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. కేసీఆర్ రాజ్యసభకు పంపడం వల్ల ప్రకాష్ రాజ్ నుండి కేసీఆర్ ఏం ఆశిస్తున్నాడు అంటూ రాజకీయ విశ్లేషకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు గుసగుసలాడుకుంటున్నారు.