Pawan Kalyan : వరస్ట్ క్యాలిక్యులేషన్ వేశావయ్యా పవనూ… ఇక నిన్ను ఎవరూ కాపాడలేరు..!
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంచనాలు తప్పిపోయాయా.. తలకిందులు అయ్యాయా అంటే అవుననే చెప్పాలి. నిజానికి.. పవన్ కళ్యాణ్ వచ్చే నెల నుంచి బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. పక్కాగా ప్లాన్ చేసుకొని బస్సు యాత్రను ప్రారంభించి ప్రజలను కలవాలని అనుకున్నారు. బస్సు యాత్ర గురించి పవన్ చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. మొత్తం 26 జిల్లాల్లో తన యాత్ర ఉండేలా జనసేన ప్లాన్ చేసింది. తన యాత్ర సమయంలో పవన్ కళ్యాణ్ బస ఎక్కడ? యాత్రలో ఎవరు పాల్గొంటారు.. అనే విషయాలపై మొత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాత్ర కోసం ఉపయోగించే బస్సులో లగ్జరీ సౌకర్యాలు కూడా కల్పించారు. అన్నీ ఓకే అయిపోయాయి. బస్సుతో పాటు మరో ఎనిమిది వాహనాలు కూడా ప్రయాణించడం కోసం వాటిని కూడా కొన్నారు. ఇలా తన బస్సు యాత్ర కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తయి ఇక బస్సు యాత్ర మొదలు కావడమే ఆలస్యం అని అనుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది.
ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తన బస్సు యాత్రను వాయిదా వేసుకున్నారట. అవునా.. ఎందుకు. అసలు పవన్ కళ్యాణ్ తన బస్సు యాత్రను ఎందుకు వాయిదా వేసుకున్నారు అనేదానికి కారణాలు కూడా వెతికేశారు. నిజానికి.. త్వరలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఆ మధ్య అందరూ ఊదరగొట్టారు కదా. కానీ.. ముందస్తు లేదు.. గిందస్తు లేదు.. అని మరో టాక్ వినిపిస్తోంది ఇప్పుడు. ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం.. జగన్ ఓడిపోవడం ఖాయం అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే.. అదే నిజం అయితే జనసేన అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి కదా.. ప్రజల్లో ఉండాలి కదా అని భావించిన పవన్.. ఈ బస్సు యాత్రను ప్లాన్ చేశారు.
Pawan Kalyan : అప్పటికే అభ్యర్థులను కూడా ఫైనల్ చేశారా?
ముందస్తు ఎన్నికలు వస్తాయని అందరూ చెప్పడంతో జనసేన పార్టీ అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. యాత్ర పూర్తయ్యేకల్లా అందరు అభ్యర్థులను పైనల్ చేసి ఎన్నికల్లో బరిలోకి దిగాలని పవన్ ప్లాన్ వేశారట. అక్టోబర్ 5 న ప్రారంభం అయి.. వచ్చే సంవత్సరం మార్చిలో యాత్ర ముగియాలని పవన్ కళ్యాణ్ భావించారట. ఆ తర్వాత ఎన్నికలు వస్తాయని.. అప్పుడు ఎన్నికలను ఎదుర్కోవడం ఈజీ అవుతుందని అనుకొని కోట్లు ఖర్చు పెట్టి మరీ ఈ యాత్రను రూపొందించారు. కానీ..చివరి నిమిషంలో అసలు ముందస్తు లేవు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఎన్నికల షెడ్యూల్ 2024 లోనే రానున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లడం అవసరమా. ఇంకా ఎన్నికలను రెండేళ్ల సమయం ఉంది కదా అని పవన్ కళ్యాణ్ యాత్రను వెంటనే రద్దు చేసుకున్నారట. చూద్దాం మరి.. మళ్లీ పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ఎప్పుడు ఉంటుందో?