7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ ఎప్పుడు పెరగబోతోంది? పెరిగిన డీఏ ఏ నెల జీతంతో రానుంది?
7th Pay Commission : సెవెన్త్ పే కమిషన్ సిఫారసు మేరకు కేంద్రం ఉద్యోగులకు.. డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి జులై, 2022లోనే 17 శాతంగా ఉన్న డీఏను 11 శాతానికి పెంచి 28 శాతానికి సెట్ చేసింది కేంద్రం. సెవెన్త్ పే కమిషన్ సిఫారసుల ప్రకారమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాన్ని పెంచుతోంది కేంద్రం. అయితే.. ఈసారి డీఏను పెంచేందుకు కూడా సమాయత్తం అయినప్పటికీ.. ఈసారి 3 శాతం కంటే ఎక్కువ పెంచే అవకాశాలు లేవని స్పష్టం అవుతోంది. కోవిడ్ వల్ల ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో.. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3 శాతం కంటే ఎక్కువ పెంచే అవకాశాలు లేవని స్పష్టం అవుతోంది.
ఇదే విషయాన్ని రాజ్యసభలో కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్భణ రేటును పరిగణనలోకి తీసుకొని 3 శాతం కంటే ఎక్కువ డీఏ పెంచే అవకాశాలు అయితే లేవని కేంద్రం తేల్చి చెప్పింది. డీఏ పెంపు విషయమై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినేట్ మీటింగ్ జరగాల్సి ఉంది కానీ.. అది జరగలేదు. మళ్లీ ఎప్పుడు కేబినేట్ మీట్ ఉంటుంది.. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
7th Pay Commission : డీఏ, డీఆర్ రెండు పెంచుతారా?
డీఏతో పాటు.. డీఆర్ ను కూడా పెంచాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. అయితే.. ద్రవ్యోల్భణ రేటు ఆధారంగానే డీఏ, డీఆర్ పెంపు ఉంటుంది. 2021లో అక్టోబర్, డిసెంబర్ మూడో త్రైమాసికంలో 5.01 శాతం ద్రవ్యోల్భణ రేటు నమోదయింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ద్రవ్యోల్భణ రేటు ఇంకా పెరిగి 6.07 కు చేరుకుంది.అందుకే.. ప్రస్తుతం ఉన్న 28 శాతం డీఏను 3 శాతానికి పెంచితే.. అది 31 అవుతుంది. ఆ తర్వాత మరోసారి 3 శాతం పెంచే అవకాశం ఉంది. దీని వల్ల.. 50 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది.