KCR : సిఎం కేసీఆర్ మేడారం వెళ్తారా లేదా…?
KCR : సిఎం కేసీఆర్ మేడారం పర్యటనకు వెళ్తారా లేదా అనే దానిపై ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తి పెరుగుతుంది. సిఎం కేసీఆర్ పర్యటనపై మంత్రులకు సైతం సమావేశం అవ్వలేదని తెలుస్తుంది. మంత్రులు కొందరు మేడారం లోనే ఉంటున్నారు. అయినా సరే వాళ్లకు ఏ విషయం చెప్పకపోవడంతో అసలు ఏం జరుగుతుందా అని ఆరా తీస్తున్నారు.
అయితే ఈ విషయంలో బీజేపీ నేతలు దూకుడుగా ఉన్నారు. మేడరం బాట పట్టిన బీజేపీ కీలక నేతలు… ఏకంగా కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించారు. కేంద్ర గిరిజనశాఖ మంత్రి రేణుక సింగ్ తో కలిసి హెలికాప్టర్ లో మేడారం కు కిషన్ రెడ్డి చ్చేరుకున్నారు.

will cm kcr go to medaram or
బీజేపీ కార్యాలయం నుంచి గిరిజన మోర్చా జాతీయ అధ్యక్షుడు సమీర్ ఒరన్ తో కలసి సమక్క జాతరకు బండి సంజయ్ వెళ్ళారు.బండి సంజయ్ తో పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్తున్నారు. హుజురాబాద్ నుండి మేడారం బయలుదేరిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర… పలువురు నేతలకు స్వయంగా ఫోన్ చేసారు.