Ponguleti Srinivasa Reddy : పొంగులేటి గురించి తెలంగాణ మొత్తం హాట్ టాపిక్ ఇదే
Ponguleti Srinivasa Reddy : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా నేత. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకే షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పొంగులేటి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఓవైపు తన కూతురు పెళ్లి జరిగి రెండు రోజులు కూడా కాలేదు. అప్పుడే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన వార్తలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. పొంగులేటి అంగరంగ వైభవంగా తన కూతురు వివాహ వేడుకను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు తన రిసెప్షన్ ఏం జరిగింది.. అనేదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి..
నిజానికి.. పొంగులేటి చాలా రోజుల నుంచి టీఆర్ఎస్ పార్టీపై అంటీముట్టనట్టుగానే ఉన్నారు. అందుకే.. ఆయన టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వనున్నారని.. బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. మునుగోడులో బీజేపీ ఆగస్టు 21న భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈనేపథ్యంలో ఆరోజే మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో పొంగులేటి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని టాక్.
Ponguleti Srinivasa Reddy : కోమటిరెడ్డి కూడా ఆరోజే బీజేపీలోకి చేరిక
మునుగోడు సభలోనే ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలో మునుగోడు సభలోనే చేరే అవకాశం ఉంది. ఆరోజే పలువురు కీలక నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరనున్నారు. వాళ్లతో పాటే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీజేపీ చేపట్టిన ఈ కార్యక్రమంలో పొంగులేటి కూడా చేరే అవకాశం ఉంది.
అయితే.. ఇటీవల జరిగిన పొంగులేటి కూతురు రిసెప్షన్ వేడుకలో టీఆర్ఎస్ ముఖ్యనేతలు కనిపించలేదు. లక్షల మంది అతిథులు ఆయన కూతురు వివాహ వేడుకకు వచ్చారు. కానీ.. టీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం హాజరు కాలేదు. దాదాపు రూ.250 కోట్లతో పొంగులేంటి తన కూతురు వివాహ రిసెప్షన్ ను నిర్వహించినట్టు తెలుస్తోంది. అంత డబ్బు పెట్టి ఘనంగా రిసెప్షన్ ను నిర్వహిస్తే.. టీఆర్ఎస్ నేతలు ఎందుకు హాజరు కాలేదు అనే వార్తలు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
అయితే.. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా రిసెప్షన్ కు హాజరయ్యారు. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. టీఆర్ఎస్ నేతలెవ్వరూ రిసెప్షన్ కు రాకపోవడంతో పాటు బీజేపీ నేతలు రిసెప్షన్ లో హైలైట్ గా నిలవడంతో పొంగులేటి టీఆర్ఎస్ ను వదిలేసి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై నిజనిజాలు తెలియాలంటే మరో రోజు ఆగాల్సిందే.