Rahul Gandhi : బంగారం లాంటి అవకాశం రాహుల్ గాంధీ సీరియస్ గా వినియోగించుకుంటాడా?
Rahul Gandhi : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఇంకో రెండేళ్లలో రానున్నాయి. ఈనేపథ్యంలో ఇప్పటి నుంచే పలు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు కూడా ఇప్పటి నుంచే ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారైనా ఎన్నికల్లో గెలవాలని తెగ ట్రై చేస్తోంది. అందుకే రాహుల్ గాంధీ ఇప్పటి నుంచే భారత్ జోడో యాత్రను చేపట్టారు. ఇటీవలే ఈ యాత్ర ప్రారంభం కూడా అయింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అంటే దేశమంతా రాహుల్ గాంధీ పాదయాత్ర ఉండనుంది. మొత్తం 3570 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు.
ఇప్పటికే 1000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. కన్యాకుమారి నుంచి ఆయన పాదయాత్ర మొదలు కాగా.. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆయన పాదయాత్ర పూర్తయింది. రోజుకు రాహుల్ గాంధీ కనీసం ఒక 20 కిలోమీటర్లు నడుస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఏపీలో పాదయాత్ర చేస్తున్నారు. 41వ రోజు పాదయాత్రలో భాగంగా ఏపీలోకి కర్నూలు జిల్లాలోకి ఎంటర్ అయింది. ఇవాళ రాహుల్ గాంధీ 22 కిలోమీటర్లు నడిచారు. రాహుల్ తో పాటు ఏపీ పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, జైరామ్ రమేశ్ పాల్గొన్నారు.
Rahul Gandhi : ఏపీలో ప్రారంభమైన రాహుల్ గాంధీ పాదయాత్ర
రాహుల్ గాంధీ తన పాదయాత్రలో భాగంగా ఎన్నో సమస్యలు వస్తాయని అనుకున్నారట. కానీ.. తనకు ఆరోగ్య పరమైన ఎలాంటి సమస్యలు రావడం లేదట. కానీ.. తనతో పాటు నడుస్తున్న వాళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే.. తనతో పాటు నడిచే చాలామంది కార్యకర్తల కాళ్లకు కట్లు కట్టారు. అయినా కూడా వీరంతా ఉత్సాహంగా యాత్రలో నడుస్తున్నారు. అయితే.. వాళ్ల వెంట డాక్టర్లు ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్ల ఆరోగ్య స్థితిని తెలుసుకుంటున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం చాలా ఉత్సాహంలో అడుగులు వేస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. సామాన్య కార్యకర్తల్లో రాహుల్ గాంధీ ఉత్సాహం పెంచుతున్నారు.