YS Sharmila : షర్మిల ఖమ్మం సభకు విజయమ్మ వస్తున్నారా? ఫోకస్ అంతా విజయమ్మ మీదే?
YS Sharmila : తెలంగాణలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక తర్వాత అంత ప్రాధాన్యత ఉన్న మరో విషయం వైఎస్ షర్మిల పార్టీ. ఈనెల 9న అంటే రేపు వైఎస్ షర్మిల ఖమ్మంలో సంకల్ప సభను నిర్వహించనున్నారు. ఈ సభలో షర్మిల పార్టీ పేరును ప్రకటించడంతో పాటు…. పార్టీ విధివిధానాలను ప్రజలకు వెల్లడించనున్నారు.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని మాటిచ్చిన షర్మిల 9న పార్టీకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే… ఈ సభకు తన తల్లి విజయమ్మ వస్తారా? రారా? అనే మరో సందిగ్దత కూడా నెలకొన్నది.
ఎందుకంటే… ప్రస్తుతం వైఎస్ విజయమ్మ వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఏపీలో ఈ పార్టీ అధికారంలో ఉంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఓవైపు ఏపీలో అధికారంలో ఉన్న పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ… తెలంగాణలో తన కూతురు షర్మిల పెడుతున్న పార్టీకి వస్తారా? అనేదే తెలియట్లేదు. అందుకే…. ప్రస్తుతం ఫోకస్ మొత్తం విజయమ్మ మీదనే ఉంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే ఎలాగూ రారు. ఇక మిగిలింది విజయమ్మే. అయితే… ఇటీవల విజయమ్మ ఒక బహిరంగ లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కుటుంబంపై ఎల్లో మీడియా ప్రవర్తిస్తున్న తీరుపై ఆమె స్పందించారు. అలాగే… షర్మిల పార్టీ విషయంలోనూ ఆమె పాజిటివ్ గానే స్పందించడంతో… వైఎస్ విజయమ్మ… షర్మిల ఖమ్మం సభకు ఖచ్చితంగా వస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
YS Sharmila : లోటస్ పాండ్ నుంచి 1000 కార్లతో ఖమ్మం వరకు భారీ ర్యాలీ
ఏప్రిల్ 9న ఉదయమే… లోటస్ పాండ్ నుంచి సుమారు వెయ్యి కార్లతో ఖమ్మం సభ వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని షర్మిల భావిస్తున్నారట. అలాగే.. తన తల్లి విజయమ్మతో కలిసి ర్యాలీతోనే షర్మిల కూడా ఖమ్మం సభకు చేరుకుంటారట. ఖమ్మంలోని పెవిలియన్ గ్రౌండ్ లో ఈ సభను నిర్వహించనున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలీసులు అతి తక్కువ మందితో సభ నిర్వహించుకోవాలని ఆదేశించారు. కేవలం 5 నుంచి 6 వేల మందితో మాత్రం ఈ సభ జరగనుంది. స్టేజ్ మీద సుమారు వంద మంది ముఖ్య నేతలను కూర్చోబెట్టనున్నట్టు తెలుస్తోంది. అలాగే… ఈ సభలో వివిధ పార్టీలకు చెందిన కొందరు నేతలు షర్మిల సమక్షంలోనే షర్మిల పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది.