ప్రియుడి కోసం భర్తను చంపేసిన భార్య .. చివరికి ఆమె కూడా ?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ప్రియుడి కోసం భర్తను చంపేసిన భార్య .. చివరికి ఆమె కూడా ??

 Authored By aruna | The Telugu News | Updated on :4 August 2023,1:00 pm

women murder case : ప్రస్తుతం సమాజం ఎటు పోతున్న కూడా అర్థం కావడం లేదు. వావి వరసలు లేకుండా కొందరు పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకొని పచ్చని కాపురాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి భర్తను చంపేసిది. ఈ ఘటన జీడిమెట్లలో చోటు చేసుకుంది. అనంతరం బెయిల్ పై విడుదలైన ఆ మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం పెట్టి తిరిగి ఇంటికి వచ్చింది. ఆకాశపటికే బయటికి వెళ్లి శవమైతే వెళ్ళింది. కట్ట మైసమ్మ పాలయ సమీపంలోని చెరువుపై ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు.

పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతురాలు రేణుక అలియాస్ ధరణిగా గుర్తించారు. సూరారం విశ్వకర్మ కాలనీకి చెందిన సురేష్ తో రేణుకకు ఏడేళ్ల క్రితం వివాహం అయింది. వీరిద్దరికీ ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. అనంతరం కుటుంబ కలహాలతో భర్త సురేష్ తో విడిపోయి ఉంటున్న రేణుక దుండిగల్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో వాచ్మెన్ గా పనిచేస్తున్న సాయిబాబాతో సహజీవనం చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త సురేష్ భార్య రేణుకను మందలించాడు. దీంతో ఎలా అయినా సురేష్ అడ్డు తొలగించుకోవాలని భావించిన రేణుక మరో మహిళతో కలిసి భర్త సురేష్ ను దారుణంగా హత్య చేసింది. ఆ కేసులో జైలుకెళ్ళిన రేణుక ఇటీవల బెయిల్ పై తిరిగి వచ్చింది.

women murder case

women murder case

తాజాగా పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి ఇంటికి వెళ్లిన రేణుక పని మీది తిరిగి బయటికి రాగా రేణుకను బంధం చెరువు కట్టపై హత్య చేశారు. మృతురాలు రేణుకా మృతదేహం పై ఉన్నటువంటి గాయాలను చూసి హత్యగా తేల్చారు. దీంతో ఆమె ఫోన్ ను పరిశీలించగా చివరి ఫోన్ కాల్ రేణుక భర్త సురేష్ తమ్ముడు నరేష్ తో మాట్లాడినట్లుగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీ కి తరలించారు. దీంతో సురేష్ తమ్ముడు నరేష్ రేణుకను హత్య చేసి ఉంటాడని పోలీసులు భావించారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది