"సిగ్గు లేదా జగన్ నీకు" ఈ మాట అన్నది ఎవరో కాదు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

“సిగ్గు లేదా జగన్ నీకు” ఈ మాట అన్నది ఎవరో కాదు..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :31 December 2020,2:18 pm

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రోజురోజుకూ డోస్ పెంచుతున్నారు. తన సొంత పార్టీ వైసీపీ మీద, సీఎం జగన్ మీద విమర్శల దాడి చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎంపీ గెలిచి.. తర్వాత రెబల్ గా మారి.. పార్టీకి ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు రఘురామ. ఢిల్లీలోనే ఉంటూ.. వైసీపీ బాగోతాలను ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు.

ycp mp raghuramakrishnamraju fires on ap cm ys jagan

ycp mp raghuramakrishnamraju fires on ap cm ys jagan

రాముడి గుడి ధ్వంసం ఘటనపై?

అయితే.. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్థం దగ్గర్లోని బోడికొండపై ఉన్న సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. సరిగ్గా ఏపీ సీఎం వైఎస్ జగన్ విజయనగరం పర్యటనకు ముందే ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

శ్రీరాముడి విగ్రహం తల, మొండాన్ని దుండగులు వేరు చేశారు. దాన్ని ధ్వంసం చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు అయితే తీవ్రంగా స్పందిస్తున్నారు. హిందుత్వ వాదులు కూడా ఏంటి ఇది.. హిందూ దేవాలయాలపై ఇలా దాడులకు పాల్పడుతున్నారు.. అంటూ విరుచుకుపడుతున్నారు.

ycp mp raghuramakrishnamraju fires on ap cm ys jagan

ycp mp raghuramakrishnamraju fires on ap cm ys jagan

ఈనేపథ్యంలో వైసీపీ ఎంపీ రఘురామ కూడా స్పందించారు. అసలు.. సీఎం జగన్ కు సిగ్గుందా? ఇలాంటి పనులా చేసేది. హిందూ దేవాలయాలపై కావాలని కొందరు దాడులు చేస్తున్నారు. హిందూ మతాన్నే కావాలని టార్గెట్ చేస్తున్నారు. దీని వెనుక ఎవరి హస్తం ఉందో వెంటనే ప్రభుత్వం తేల్చాలి. జగన్ కు హిందువులంటే అంత చులకనగా కనిపిస్తున్నారు. ఇలా.. వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారు. ఎందుకు ఆ దాడులను ఆపలేకపోతున్నారు. సీఎంకు ఏమాత్రం సిగ్గు ఉన్నా… ఈ దాడులను వెంటనే ఆపించేయాలి.. అంటూ రఘురామ డిమాండ్ చేశారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది