Vijayasai Reddy : విజయసాయి రెడ్డి ట్వీట్ల యుద్ధం.! టీడీపీ వెన్నులో వణుకు.!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల మీద. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ని ఏకంగా ‘బోకేష్.. ఎలకేష్..’ అంటూ వెటకారం చేస్తూ, ఘాటైన ట్వీట్లు వేసిన విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై ఇంకా దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కొన్నాళ్ళ క్రితం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ‘చెత్త నా కొడకా..’ అంటూ తీవ్ర పదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే. ‘చెత్త మీద పన్నేసేవాడ్ని చెత్త నా కొడకా.. అని కాకుండా ఏమనాలి.?’ అంటూ పదే పదే ఆయన అదే మాటని వాడుతూ వస్తున్నారు.‘మహానాడు’ వేదికగా కూడా అయ్యన్న పాత్రుడు చెలరేగిపోయారు.
మీడియా మైకులు కనిపిస్తే చాలు, అయ్యన్న సంయమనం కోల్పోతున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీదా, విజయసాయిరెడ్డి మీదా అనుచిత వ్యాఖ్యలు చేయడం అయ్యన్నపాత్రుడికి అలవాటైపోయింది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కూడా లిమిట్స్ క్రాస్ చేయక తప్పలేదేమో.! ‘ఓరినీ అయ్య…న్న! నిన్ను సృష్టించేటప్పుడే దేవుడు నీకు అన్నం తినేది కింద, అశుద్ధం పేగు పైన పెట్టాడు. కాబట్టే నువ్వు ఏం మాట్లాడినా నీ కంపునోటినిండా పెంటపెంటే!’ ‘కుక్క రోడ్డుమీద మొరుగుతుంది. వీడు కెమెరా ముందు మొరుగుతాడు. కుక్క గంజి తాగుతుంది– వీడు గంజాయి తాగుతాడు. కుక్క పాలో నీళ్ళో తాగుతుంది. వీడు నాటు సారా తాగుతాడు. కుక్క– వీడు ఒకటే తింటారు! ఇలాంటి వెధవ నోట మంచి మాటలు ఎందుకు వస్తాయి?’ ‘బాయ్య లోకెల్లా అతి పెద్ద బాయ్య… వాడి పేరు చింతకాయ! ఈ కొజ్జా రికార్డింగ్ డ్యాన్సర్‌గాడు, తాగేది మందు… దూరేది సందు… చెప్పేది శ్రీరంగనీతులా? ఈ అడ్డగాడిద మత్తు అడ్డంగా దింపేసే టైమ్ దగ్గర పడింది…’
ఇలా సాగింది అయ్యన్న పాత్రుడి మీద విజయసాయిరెడ్డి ట్వీట్ల ప్రవాహం. నారా లోకేష్ మీద విజయసాయిరెడ్డి ట్వీట్లు ఎలా వున్నాయంటే.. ‘మై డియర్ బోకేష్! ఎమ్మారై మెషిన్‌లో పెడితే నీకున్న బ్రెయిన్ ఆవగింజంత… స్కానింగ్‌ను ముందుకు కదుపుదాం అంటే మిగతాది సీమ పంది అంత! నీ బతుకే ఖావోస్… దావోస్ గురించి నీకెందుకు చెప్పు? మేసింది చాలు… మూసుకు కూర్చో!’ ‘మై డియర్ ఎలకేష్! నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థం అయ్యింది. ఎదర ఎలకకి ఉన్నంత… వెనక ఏనుగుకున్నంత! ఇదీ నీ సిస్టమ్! పైగా నీ వాయిస్ నిండా పొగ గొట్టం లేని కిరసనాయిల్ కారు సౌండే. దీనికి మమ్మల్ని తిట్టి ఏం ప్రయోజనం? కొన్నికొన్ని మారవు బాబూ!’ అని విజయసాయిరెడ్డి ట్వీట్లేయడంతో టీడీపీ శ్రేణుల్లో అలజడి బయల్దేరింది. విజయసాయిరెడ్డిని దూషిస్తూ టీడీపీ శ్రేణులూ ట్వీట్ల పరంపర కొనసాగిస్తున్నాయి. కుక్క కాటుకి చెప్పు దెబ్బ.. అన్నట్టుగానే విజయసాయి స్పందించారని వైసీపీ నేతలు అంటున్నారు.