ఆమెకు 75 .. అతడికి 35 .. చివరికి ప్రేమ పెళ్లి .. ఆ తర్వాత ఏం జరిగిందంటే ..??
ప్రస్తుతం ఉన్న ఆన్లైన్ వ్యవస్థ కారణంగా దేశాల మధ్య అడ్డుగోడలను చెరిపేశారు. ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ ల ద్వారా ప్రేమించుకుంటూ దేశ, భాష, ప్రాంతం అవేమీ తేడా లేకుండా చివరికి పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. తాజాగా ఓ జంట ఫేస్ బుక్ ద్వారా పరిచయమై చివరికి పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్ళ జంట అందరికీ విభిన్నంగా ఉంది. ఆమె వయసు 75. అతడికి 35. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చిన వారిద్దరూ మాత్రం సంసార జీవితాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారు. పాకిస్థాన్‌కు చెందిన నయీమ్ షాజాద్ అనే 35 ఏళ్ల యువకుడికి కెనడాకు చెందిన 70 ఏళ్ల మేరీ వృద్ధురాలితో 2012 లో ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది.
అయితే మొదట మామూలు ఫ్రెండ్ షిప్‌గానే ఉన్నా ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2017లో ప్రేమిస్తున్నట్టు తనలోని ప్రేమను బయటకు చెప్పింది మేరి. దీంతో నయిమ్ అందుకు అంగీకరించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు 2017 లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వారు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటూ సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత వారికి వీసా సమస్యలు తలెత్తడంతో వారిద్దరూ కలిసి కెనడాలో జీవించలేకపోయారు. ఈ క్రమంలోనే ఇటీవల పాకిస్తాన్ కు వచ్చిన మేరీ నయిమ్ వద్ద ఆరు నెలల పాటు ఉంటున్నట్లు తెలిపింది. అయితే వీరి పెళ్లిపై నెటిజెన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
డబ్బు, కెనడా పౌరసత్వం కోసమే 70 ఏళ్ల మేరీని 35 ఏళ్ల నయిమ్ పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. తన అవసరాల కోసం ఆమెను పెళ్లి చేసుకున్నాడని మండిపడుతున్నారు. అయితే ఇలా వస్తున్న ఆరోపణలను నయీమ్, మేరీ జంట ఖండిస్తున్నారు. తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని మా మధ్య ఎప్పుడు వయస్సు సమస్య రాలేదని చెబుతున్నారు. నయీమ్ ని మేరీ ఆదుకుందని, క్లిష్ట పరిస్థితుల్లో తనకు మానసికంగా ధైర్యం చెప్పిందని అదే వారి ప్రేమ పెళ్లికి దారి తీసింది అని పేర్కొన్నారు. అయితే ఇక్కడ మేరీ పెద్దగా ధనవంతురాలు ఏమి కాదు ఆమెకు వచ్చే పెన్షన్తో బతుకుతుందని నయిమ్ వెల్లడించాడు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన తాను పట్టించుకోనని చెప్పాడు.