YS Jagan 2024 Mission : వైఎస్ జగన్ 2024 మిషన్ స్టార్ట్.. వామ్మో.. జగన్ ప్లాన్లను అంచనా వేయడం కష్టమే?
YS Jagan 2024 Mission 2019 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పరిపాలన కొనసాగిస్తున్నారు. 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో సహచర మంత్రులతో దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది పార్టీ కోసం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పీకే టీమ్ మళ్లీ వస్తుందని మంత్రులకు చెప్పినట్లు సమాచారం. ఈలోగా క్షేత్ర స్థాయిలో ఎన్నికలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రులను సీఎం జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ భేటీలో సీఎం జగన్ తన మిషన్ 2024 అని తేల్చి చెప్పారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైసీపీ పార్టీ.. ఇప్పటికే రెండున్నరేళ్ల అధికారం పూర్తి చేసుకున్నారు వైఎస్ జగన్. ఇక, తిరిగి 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవటంపై ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ పధకాలపైన చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని సీఎం జగన్ మంత్రులకు సూచించారు. అదేవిధంగా పార్టీ నేతలతో మంత్రులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రస్తుత కేబినెట్‌లో ఉన్న మంత్రులను మార్చి వారికి పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ముఖ్యంగా మిషన్ 2024 లక్ష్యంతో పనిచేసేలా సీఎం జగన్ ముందుస్తు ప్రణాళికలు రచిస్తున్నారు.
ముందస్తు వ్యూహంలో .. YS Jagan
బయట ప్రతిపక్షాలు ..ఇతరు లు ప్రచారం చేస్తున్నట్లుగా ప్రభుత్వం పైన వ్యతిరేకత లేదని … ప్రజల్లో ఉన్న సానుకూలత మరింత అనుకూలంగా మలచుకొనే వ్యూహాలు అమలు చేయాలని వైఎస్ జగన్ నిర్దేశించారు. అందు కోసం ప్రతి మంత్రి..ఎమ్మెల్యే ప్రతి ఇంటికి పార్టీ ప్రభుత్వ పధకాల గురించి వివరిస్తూ గడప గడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా అక్టోబర్ 2 నుంచి తాను ప్రభుత్వ పధకాల సమీక్షల్లో భాగంగా రచ్చబండలో పాల్గొంటానని వెల్లడించారు. దీంతో..వైసీపీ ముందస్తుగానే 2024 ఎన్నికల కోసం రంగంలోకి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది.
సీఎం మాత్రం అధికారంలో ఉన్నా..వచ్చే ఎన్నికల పైన అప్పుడే మంత్రులకు దిశా నిర్దేశం చేయటం…సీనియర్లను తొలిగించక తప్పదనే సంకేతాలు ఇవ్వటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకించి వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం వ్యాఖ్యలతో ప్రతిపక్షాల్లోనూ కలవరం మొదలైంది.ఆయన పరిపాలన సరిగ్గా లేదని విపక్షాలు విమర్శలు చేస్తున్నా.. ఆయన మాత్రం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అందుకోసం ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
మళ్లీ పీకే టీం.. YS Jagan
2019 ఎన్నికలకు దాదాపుగా ఏడాదిన్నర ముందుగానే ఏపీకి వచ్చి వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం మరోసారి తమతో కలిసి పనిచేయనున్నట్లు చెప్పినట్లు సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకూ ఆ టీం పార్టీ కోసం పని చేస్తుందని వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు పీకే టీం తిరిగి వైసీపీ కోసం పని చేసేందుకు రానుందని స్వయంగా సీఎం జగన్ చెప్పడంతో, దీన్ని ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశంగా పార్టీ నేతలు చెబుతున్నారు.