YS Jagan : ప్రస్తుతం జగన్ ను టెన్షన్ పెడుతున్న విషయం అదొక్కటే.. అక్కడ నెగ్గితే సీఎంకు తిరుగేలేదిక?
YS Jagan : కడప జిల్లా బద్వేలు బైపోల్ అధికార పార్టీని కలవరపెడుతోందన్న టాక్ ఇప్పుడు వెల్లువెత్తుతోంది. ఏకంగా ముగ్గురు మంత్రులకు బద్వేలు ఎన్నికల బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా నేతలతో పాటు ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలను ఇంచార్జులుగా నియమించడంతో, చర్చోపచర్చలు వెల్లువెత్తాయి.
YS Jagan : 2019లో కంటే అత్యధిక మెజారిటీతో దాసరి సుధను గెలిపించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ ఇన్చార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తున్నట్టు వెల్లడించారు. పెద్దిరెడ్డితో పాటు జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా మంత్రి అంజాద్ బాషాలను ఇంచార్జులుగా నియమించారు. ఇద్దరు ఎంపీలకు ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించారు. కడప జిల్లా నేతలంతా బద్వేలులో ఉండేలా సీఎం జగన్ ప్రణాళిక రచించారు. ఉప ఎన్నిక సందర్భంగా ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుని పోవాలని బద్వేలు స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు.
YS Jagan : తిరుపతి బైపోల్ దెబ్బకు..
అయితే అధికారపార్టీలో ఉప ఎన్నిక టెన్షన్ కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. తిరుపతి ఎంపీ బైపోల్ లో అధికారపార్టీ గెలుపుకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. రెండు లక్షల మెజార్టీతో గెలిచామని విర్రవీగే పరిస్థితి లేకుండా పోయింది. ఎలక్షన్‌కు ముందు 6 లక్షల మెజార్టీ వస్తుందని మంత్రులు ఫోజులు కొట్టారు. ప్రచారం మొదలయ్యేసరికి ఆ ఫిగర్ తగ్గుతూ పోయింది.. ఓ దశలో ఓడిపోతామేమోననే టెన్షన్ కూడా కనిపించింది. అందుకే .. బద్వేల్ బైపోల్ లో సేమ్ సీన్ రిపీట్ అవకుండా చూడాలని సీఎం జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది.
YS Jagan : ఝలక్ తప్పదా..
సీఎం సొంత జిల్లా, వైసీపీకి గట్టి పట్టు, సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయారన్న సానుభూతి వంటి అదనపు బలాలున్నా.. వైసీపీలో ఈజీగా గెలుస్తామనే ధీమా కనపడడడం లేదని విశ్లేషకులుచెబుతున్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్‌ను ఓడించి కేసీఆర్‌కు షాక్ ఇచ్చినట్టు.. బద్వేలులో వైసీపీకి బుద్దిచెప్పి జగన్‌కు ఝలక్ ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే అధికార పార్టీలో టెన్షన్ నెలకొందని అంటున్నారు. ఆ భయంతోనే సీఎం జగనే స్వయంగా రంగంలోకి దిగారని టాక్ వెల్లువెత్తుతోంది. ముందు ముందు మరికొందరు మంత్రులను అక్కడే మోహరించే అవకాశాలు కన్పిస్తున్నాయి.