YS Jagan : చంద్రన్న సానుభూతి రాగం.. జగన్‌కు ఎదురుదెబ్బే..?
YS Jagan : ఎన్నికలకు మూడేళ్ల ముందరే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగా వేడెక్కాయి. ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీ మధ్య యుద్ధం ఒక రకంగా ప్రారంభమైందనే చెప్పొచ్చు. అసెంబ్లీ సాక్షిగా తనకు అవమానం జరిగిందని, తాను సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ చంద్రబాబు శపథం చేశాడు. ఈ క్రమంలోనే మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. దాంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబుకు సానుభూతి ఏర్పడింది. ఈ సానుభూతి సంకేతాలు జగన్‌కు ఎదురు దెబ్బ అయే చాన్సెస్ ఉంటాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
YS Jagan : గతంలో సానుభూతితో ఓట్ల వర్షం.. ఈ సారి అలానే..?
ఎన్నికలకు ముందరే కొన్ని రకాల సీన్లు రక్తి కట్టిస్తుండటం మనం చూడొచ్చు. ఏపీలో ఇటువంటి సీన్లు గతంలో జరిగాయి. ఏపీ ప్రజెంట్ సీఎం వైఎస్ జగన్‌ను అప్పట్లో విశాఖ ఎయిర్ పోర్టులో కత్తితో దాడి చేశారు. దానిని కోడి కత్తి డ్రామా అని టీడీపీ, జనసేన నేతలు విమర్శించినప్పటికీ ఆ సానుభూతి ఎంతో కొంత ఓట్ల రూపంలో పనికొచ్చిందని చెప్పొచ్చు. జగన్ సుదీర్ఘ కాలం పాటు చేసిన పాదయాత్ర, కత్తిదాడి అంశాలు ఓట్ల రూపంలో వర్షం పడి జగన్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. కాగా, చంద్రన్నకు సైతం అదే ప్లాన్ వర్కవుట్ అయే చాన్సెస్ మెండుగా ఉంటాయి.
చంద్రబాబు తన భార్యను కించపరిచారంటూ మీడియా సాక్షిగా ఏడ్చిన దృశ్యాలు చాలా మంది విచారం వ్యక్తం చేశారు. అంత పెద్దాయనను అలా అవమానపరచడం సరికాదని పేర్కొంటున్నారు. కాగా, ఈ సానుభూతిని చంద్రబాబు నాయుడు మరో మూడేళ్ల పాటు అనగా 2024 ఎన్నికల వరకు అలానే కొనసాగించాల్సి ఉంటుంది. చంద్రబాబు వ్యాఖ్యానాలు, ఏడుపుపై అధికార వైసీపీ నేతలు, జగన్ వివరణ ఇచ్చినప్పటికీ ఇప్పటికయితే ప్రజల్లో చంద్రన్నపైనే సానుకూల దృక్ఫథం, సానుభూతి ఉన్నట్లు పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ పరిస్థితులను ఇలాగే మూడేళ్ల పాటు కొనసాగిస్తే కనుక జగన్‌కు ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలొచ్చిని విశ్లేషకులు అంటున్నారు.