YS Jagan : ఆ యువ మంత్రి పదవి ఊస్టింగేనట.. వైఎస్ జగన్ కు కోపం తెప్పిస్తే పదవి ఉంటుందా?
YS Jagan : మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు సమయం దగ్గర పడేకొద్దీ పలువురు మంత్రుల్లో గుబులు పెరుగుతోంది. ఇన్నాళ్లూ తన పదవికేం కాదంటూ బిందాస్‌గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ Anilkumar Yadav .. ఇప్పుడు ఎక్కడ తన సీటుకు ఎసరు వస్తుందోనని తెగ టెన్షన్ పడుతున్నారట. వైఎస్ జగన్ ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపించడం.. ఇటీవల జరిగిన పోలవరం పర్యటనలో ఆ శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ కు తగిన ప్రాధాన్యం దక్కకపోవడం.. అందుకు ఇండికేషన్లుగా భావిస్తున్నారు.
సీఎం వైఎస్ జగన్ YS Jagan పోలవరం ప్రాజెక్టు సందర్శన ఆసాంతం నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పక్కనే లేకుండా.. అప్పుడప్పుడు మాత్రమే పక్కన ఉండి.. ఆ తర్వాత చాలా వెనకాలే ఉండిపోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.
పోలవరం పర్యటనలో.. YS Jagan
నీటి పారుదల శాఖ అధికారులతో సీఎం జగన్ జరిపిన సమీక్షలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ Anilkumar Yadav కు అంతగా ప్రాధాన్యం లభించలేదు. ప్రాజెక్ట్ సందర్శనలో కూడా ఇతర మంత్రులు ముందుకొచ్చారే కానీ, అనిల్ కుమార్ యాదవ్ వెనకబడిపోయారు. ఇక హెలికాప్టర్‌తో ఏరియల్ వ్యూ విషయంలోనూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను పక్కన పెట్టేశారు సీఎం జగన్.ముఖ్యమంత్రి, ఇతర అధికారులు మాత్రమే హెలికాప్టర్ ఎక్కారు. అనిల్ కుమార్ యాదవ్ Anilkumar Yadav కి ప్లేస్ మిస్ అయింది.
కేవలం హెలికాప్టర్ లోనేనా? లేక, కేబినెట్‌లో కూడానా అని టాక్ సర్వత్రా వినిపిస్తోంది. యువతకు ప్రాధాన్యం పేరుతో.. బీడీఎస్ చదివిన అనిల్ కుమార్ యాదవ్ కు కీలకమైన జలవనరుల శాఖ కట్టబెట్టడంపై మొదట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అటు తర్వాత అనిల్ కుమార్ యాదవ్ నోరు, మాట తీరు చూసి.. ఇలాంటి వారిని కూడా మంత్రులను చేస్తారా అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు.
తెలంగాణ మంత్రులకు తగ్గట్టు.. YS Jagan
జనం అనుకున్నట్టుగానే.. వైఎస్ జగన్ కోరుకున్నట్టుగానే.. రెండేళ్లుగా నోటికి పని చెప్పడం మినహా, తన మంత్రిత్వ శాఖ పని చేయడం తక్కువేనన్న టాక్ వినిపించింది. కట్టప్ప రోల్‌లో తెగ జీవించేసిన అనిల్ కుమార్ యాదవ్ కు తెలంగాణ మంత్రుల రూపంలో ఊహించని షాక్ తగిలిందని చెబుతున్నారు. ఆ బటర్ ఫ్లై ఎఫెక్ట్ మూలంగానే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మంత్రిపదవికి గండం వచ్చిందని అంటున్నారు. రెండు రాష్ట్రాల జలవివాదంలో తెలంగాణ మంత్రులు రెచ్చిపోయారు.ఆ శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ Anilkumar Yadav ఏపీ తరఫున స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోయారు. అందుకే జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను అప్పటికప్పుడు సైడ్ చేసేసి.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్ రంగంలోకి దింపారని తెలుస్తోంది. అందుకే, ఇటీవల తెలంగాణ ఆరోపణలపై.. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాకుండా, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డినే స్పందిస్తున్నారని అంటున్నారు.