YS Jagan : ఉగాది నాడు ఒకే ఒక్క ప్రకటన… ఏపీ యూత్ అంతా జగన్ కు జేజేలు కొట్టేలా చేయనుంది?
YS Jagan : వైఎస్ జగన్.. ఏపీ సీఎం మాత్రమే కాదు… ఏపీ ప్రజల పాలిట దేవుడు అని అంటున్నారు ఇప్పుడు. రాజకీయాల్లో అనుభవం లేదు.. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కాదు. ఈయన ముఖ్యమంత్రి అయి ఏపీని అభివృద్ధి చేస్తాడా? అని జగన్ ను హేళన చేసినవాళ్లు ఉన్నారు. వాళ్లంతా ఇప్పుడు నోరు మూసుకోవడం తప్పితే ఇంకా చేసేదేం లేదు.
సీఎం జగన్ ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా ఎదిగారు అంటే.. ఆయన ఎంతలా ఏపీ అభివృద్ధి కోసం, ఏపీ ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తారో అందరికీ అర్థమవుతోంది. నిజానికి ఏపీలో ప్రవేశపెట్టినన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. పేదల కోసం, వాళ్లకు ఉపాధి కల్పించడం కోసం సీఎం జగన్ చాలా పథకాలను ప్రవేశపెట్టారు.
ఓవైపు ఏపీ ప్రజలకు కావాల్సినవి అందిస్తూ… మరోవైపు ఏపీలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో అప్రతిహాతంగా గెలుస్తూ వస్తున్నారు సీఎం జగన్. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలే దీనికి నిదర్శనం.
సీఎం జగన్… ఏ ఎన్నికలకూ ప్రచారం చేయకున్నా.. తాడేపల్లి నుంచి అడుగు బయటపెట్టకున్నా అన్ని ఎన్నికల్లో వైసీపీ విజయదుందుబి మోగించింది.
అయితే… సీఎం జగన్ ఇన్ని చేస్తున్నా… ఏపీలో నిరుద్యోగుల కోసం ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడం లేదనే విమర్శ అయితే చాలారోజుల నుంచి ఉంది. అందుకే… నిరుద్యోగులకు కూడా సీఎం జగన్ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారట.
YS Jagan : ఉగాది రోజున ఉద్యోగ ప్రకటన చేయనున్న సీఎం జగన్
ప్రస్తుతం ఏపీలో తిరుపతి ఉపఎన్నిక హడావుడి నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు ఏదీ ప్రకటించే అవకాశం లేదు. అయినప్పటికీ… సీఎం జగన్… నిరుద్యోగుల కోసం తీపి కబురు అందించాలని డిసైడ్ అయ్యారట. కొత్త సంవత్సరం రోజున అంటే వచ్చే ఉగాది నాడు ఏపీ యువతను ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం జగన్… ఆరోజు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటన చేయనున్నారట.
ఒకవేళ సీఎం జగన్… ఉగాది నాడు ఉద్యోగ ప్రకటనలు చేస్తే.. ఏపీ యూత్ అంతా ఆయనకు జేజేలు కొడతారు. అందులోనూ ఏప్రిల్ 17న తిరుపతి ఉపఎన్నిక జరగనుంది. ఏప్రిల్ 13న అంటే ఉగాది రోజున సీఎం జగన్ ఉద్యోగ ప్రకటన చేస్తే… అది తిరుపతి ఉపఎన్నికల్లో కూడా వైసీపీ గెలుపునకు ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి… ఎలాగైనా ఉగాది రోజున ఏపీ యువతకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నట్టు సమాచారం.