కార్యకర్తలకి పిలుపునిచ్చిన వైఎస్ జగన్, చాలాకాలం తరవాత వైసీపీ శ్రేణులకి గుడ్ న్యూస్
నో డౌట్.. జగన్ బెస్ట్ సీఎం. సంక్షేమ పథకాల విషయంలో ఆయన్ను మించినోడు లేడు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా.. ఏపీలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి శెభాష్ అనిపించుకున్నారు యంగ్ అండ్ డైనమిక్ సీఎం జగన్. కానీ.. కొన్ని విషయాల్లో మాత్రం ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఏ సీఎం అయినా సరే.. ఆరోపణలు, విమర్శలు అనేవి కామన్. ప్రతిపక్షాలు కావాలని ఎన్నో చేస్తాయి. ప్రస్తుతం గుడి రాజకీయాలు ఏపీలో తెగ ఫేమస్ అయిపోయాయి. అలాగే.. వైసీపీ పార్టీలో కూడా అంతర్గత విభేదాలు ఉన్నాయి. అవి కూడా జగన్ కు కాస్త ఇబ్బందిని కలిగిస్తున్నాయి.

ys jagan good news to ycp activists
ముఖ్యమంత్రిగా సీఎం జగన్ సూపర్ సక్సెస్. కానీ.. ఆయన ప్రారంభించిన ఎన్నో సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అమలు అవుతున్నాయా? నిజమైన లబ్ధిదారులకు చెందుతున్నాయా? అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఎందుకంటే.. క్షేత్రస్థాయిలో పథకాలు అమలు కావాలంటే.. ప్రజాప్రతినిధులు ముఖ్యపాత్ర పోషించాలి. కానీ.. వైసీపీ ఎమ్మెల్యేలు సంక్షేమ పథకాల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదట. ఎమ్మెల్యేలు అసలు తమ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
దీన్ని క్యాష్ చేసుకొని.. ఏపీలో బీజేపీ దూసుకెళ్తోంది. జెట్ స్పీడ్ లో ఉంది. ఏపీలో పాగా వేయడానికి బీజేపీ తెగ ప్రయత్నిస్తోంది. ఏమాత్రం సందు ఇచ్చినా చాలు దూరిపోతుంది. అందుకే… సీఎం జగన్ కొన్ని బృందాలను ఏర్పాటు చేసి.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారట. ఎక్కడ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదో.. ఆ ప్రాంతాల్లోని కార్యకర్తలతో భేటీ అయి వాళ్లతో డైరెక్ట్ గా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
సంక్షేమ పథకాలను ప్రారంభించడం ఎంత ముఖ్యమో.. వాటి అమలు బాధ్యత కూడా అంతే ముఖ్యం కాబట్టి.. ఎలాగైనా క్షేత్రస్థాయిలో కూడా కార్యకర్తలతో మీట్ అయి పరిస్థితులను అంచనా వేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. చూద్దాం మరి.. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో?