YS Jagan : బీసీలకు బడ్జెట్ లోనే కాదు గుండెల్లో సుస్థిర స్థానం… వైఎస్ జగన్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

YS Jagan : బీసీలకు బడ్జెట్ లోనే కాదు గుండెల్లో సుస్థిర స్థానం… వైఎస్ జగన్

YS Jagan : నా బీసీ కుటుంబానికి, గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్వాగతం. బీసీలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నాగరికతకు పట్టుకోమ్మలు బీసీలు. నా బీసీ కుటుంబం జనసముద్రంలా నా ముందు ఉంది. మీ హృదయంలో జగన్‌.. నా హృదయంలో మీరు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసులు కాదని.. బ్యాక్‌బోన్‌ క్లాసులు అని, వెనుకబాటు కులాలు కాదని.. వెన్నెముక కులాలు అని చాటిచెప్పే సభకు స్వాగతం.. సీఎం జగన్. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :7 December 2022,10:00 pm

YS Jagan : నా బీసీ కుటుంబానికి, గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్వాగతం. బీసీలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నాగరికతకు పట్టుకోమ్మలు బీసీలు. నా బీసీ కుటుంబం జనసముద్రంలా నా ముందు ఉంది. మీ హృదయంలో జగన్‌.. నా హృదయంలో మీరు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసులు కాదని.. బ్యాక్‌బోన్‌ క్లాసులు అని, వెనుకబాటు కులాలు కాదని.. వెన్నెముక కులాలు అని చాటిచెప్పే సభకు స్వాగతం.. సీఎం జగన్. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్. చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా బీసీ కులాలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేశాం. వైఎస్సార్‌ సీపీ మేనిఫెస్టో ఆత్మ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమమే. నవరత్నాలు అంటే ప్రతి గడపకు అందే సామాజిక న్యాయం, సాధికారతే. బీసీలకు బడ్జెట్లోనే కాదు గుండెల్లో స్థానం ఇచ్చాం.

అందుకే నాడు జనాభాలో అగ్రభాగంగా బీసీ కులాలు నేడు పదవుల్లో సింహభాగంగా మారాయి. మూడున్నరేళ్లలో బీసీ వర్గాల అభివృద్ధే అజెండాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిత్యం అడుగులు వేసింది అని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బీసీలంటే రాజకీయాలతో సహా అన్నింటిలోనూ వెన్నెముక తరగతి అని బలమైన సందేశాన్ని ఇస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ర్ట వ్యాప్తంగా ఎన్నికైన బీసీ మండల, గ్రామ స్థాయి ప్రజాతినిధులైన లక్ష మందితో బుధవారం నాడు వైఎస్సార్ సీపీ జయహో బీసీ మహాసభను నిర్వహించింది. ఈ సభలో సీఎం జగన్ కీలకోపన్యాసం చేశారు. గ్రామం, జిల్లా స్థాయి నుంచి 139 బీసీ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు ఒక వేదికపైకి చేరడంతో ఇందిరా గాంధీ స్డేడియం జన సంద్రంగా మారింది.

YS Jagan has a stable position not only in the budget but also hearts of BC

YS Jagan has a stable position not only in the budget but also hearts of BC

YS Jagan : వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో బీసీలకు సుస్థిర స్థానం

పార్టీ స్థాపించిన నాటి నుంచి బీసీలకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచి తగిన ప్రోత్సాహం అందించిందని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో 11 మంది మంత్రులు, 6 మంది లోక్‌సభ ఎంపీలు, 31 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు, 215 మంది జెడ్పీటీసీలు, 9 మంది మేయర్లు, 53 మంది ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు ​​వివిధ బీసీ వర్గాలకు చెందినవారేనని పునరుద్ఘాటించారు. అంతే కాకుండా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని, బీసీలకు అన్ని నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు అమలు చేసిందని పేర్కొన్నారు. రెండో విడత కేబినెట్‌లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. కేబినెట్‌లో పదకొండు మంది బీసీ మంత్రులు ఉన్నారు. కేబినెట్‌లో 56 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్థానం కల్పించాం. చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపించలేదు.

కానీ, మన ప్రభుత్వం ప్రతీ అడుగులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించాం. ఈ మూడున్నరేళ్లలో ఎనిమిది రాజ్యసభ స్థానాలు దక్కితే.. సగం బీసీలకే ఇచ్చాం. టీడీపీ హయాంలో బీసీలను నిలువునా ముంచేస్తే మన పాలనలో బీసీలను రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేశామన్నారు. బీసీల రాజ్యాధికార సాధనకు వైఎస్సార్ సీపీ అండగా నిలిచిందని తెలిపారు. చంద్రబాబును బడ్జెట్లో నిధులు, పదవులు అడిగినందుకు ఖబడ్దార్‌ మీ అంతు చూస్తా అని బీసీలను చంద్రబాబు బెదిరించారని మండిపడ్డారు. తోకలు కత్తిరిస్తానని పేర్కొనడం దారుణమన్నారు. కానీ ప్రస్తుతం బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములనే విషయం చంద్రబాబుకు చెప్పాలంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. బీసీలకు ఇచ్చిన మోసపూరిత హామీలు, నయవంచనను చంద్రబాబుకు గుర్తు చేస్తూ వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు.

మూడేళ్లలో రూ.3 లక్షల కోట్లతో సంక్షేమం

పేదల ఆర్థిక సాధికారత కోసం రూ.3 లక్షల 19 వేల 228 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. సంక్షేమ పథకాల్లో పేద సామాజిక వర్గాలకే పెద్ద పీట వేశామని 80 శాతం డబ్బు పేద సామాజిక వర్గాల ఖాతాల్లోకి చేర్చామని వివరించారు. టీడీపీ ప్రభుత్వంలో అప్పుల్లో పెరుగుదల రేటు 19 శాతం ఉండగా ఇప్పుడు అది కేవలం 15 శాతం మాత్రమేనని సీఎం జగన్‌ ప్రకటించారు. చంద్రబాబు హయాంలో పథకాలు ఎందుకు లేవో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. బడ్జెట్ లోని డబ్బంతా జన్మభూమి కమిటీల పేరుతో దోచుకో.. పంచుకో.. తినుకో విధానంతో అక్రమాలు, అవినీతిని ప్రోత్సహించి పేదలను నిండా ముంచేశారని విమర్శించారు.

లక్ష మంది బీసీ నేతలు ఈ అంశాన్ని గ్రామ స్థాయి వరకూ తీసుకెళ్లాలని సీఎం జగన్ సూచించారు. ‘సమాజంలోని అన్ని వర్గాలకు సమ న్యాయం చేకూర్చే మన మేనిఫెస్టోలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ దార్శనికత కనిపిస్తోందని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో బీసీల అభ్యున్నతికి అడ్డుపడుతూ బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకున్న దుష్టచతుష్టయంపై పోరాటం చేస్తానని ప్రకటించారు. 2024 ఎన్నికలు ‘న్యాయం, సంక్షేమం, నిజాయితీ, సామాజిక న్యాయం కోసం పాటుపడిన ప్రభుత్వానికి, అన్యాయం, దుర్మార్గం, అవినీతికి గేట్లు తెరిచిన చంద్రబాబు అండ్ కో కి మధ్య జరిగే ఎన్నికలుగా సీఎం జగన్ అభివర్ణించారు.

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు!

2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలే. మనమంతా మారీచులు, పెత్తందారులతో యుద్ధం చేయక తప్పదు. చంద్రబాబు, ఆయన బ్యాక్‌బోన్‌ ఎల్లో బ్రదర్స్‌, దత్తపుత్రుడు ఏ సామాజిక వర్గానికి ప్రతినిధులో ఆలోచన చేయాలి. పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టులో కేసు వేస్తున్నారు. పెత్తందారుల అర్ధిక లబ్ధి కోసం చంద్రబాబు నిరంతరం తపిస్తుంటారు. పేదల గురించి ఆలోచించే తీరిక బడా పెత్తందారులు చంద్రబాబు బినామీలకు లేదన్నారు. వైఎస్సార్‌ సీపీ సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. అన్ని వర్గా సమానత్వానికి ప్రతీక. అని సీఎం జగన్ అన్నారు.

నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య జరిగే ఈ యుద్ధంతో వైఎస్సార్ సీపీని నడిపించే బాధ్యత బీసీలు తీసుకోవాలని కోరారు. 2024లో ఇంతకు మించిన గెలుపు ఖాయమని బీసీ శ్రేణులను ఉద్దేశించి సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. చంద్రబాబు అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు వివరిస్తూ రాజ్యాధికారంలో భాగస్వామ్యులను చేసేందుకు వైఎస్సార్ సీపీ 85 వేల మంది బీసీ నేతల సైన్యం ఉందని సీఎం జగన్ భరోసా వ్యక్తం చేశారు.బీసీల కోసం నిలబడిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.

బీసీల కోసం నిలబడిన దమ్మున్న నాయకుడు జగన్: వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆర్‌. కృష్ణయ్య

కృష్ణయ్య అన్నారు. బీసీ మహాసభలో మాట్లాడిన ఆయన ఈ సభకు వచ్చింది కార్యకర్తలు కాదు.. 85 వేల మంది ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు మాత్రమేనని అన్నారు. వీళ్లందరినీ తయారు చేసింది మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అని కొనియాడారు. బీసీల వాటా బీసీలకు ఇస్తానని చేసి చూపించిన దమ్మున్న నాయకుడు మాత్రం వైఎస్‌ జగన్‌ అని వివరించారు. రాజకీయాల్లో, బడ్జెట్‌లో, విద్యలో…ఇలా అనేక రంగాల్లో బీసీలకు 50 శాతం వాటా ఇచ్చి చేతల్లో చూపించిన సీఎం జగన్ ఒక్కరేనన్నారు.

బీసీలు ఆత్మగౌరవంగా తలెత్తుకునేలా దేశంలోనే మొట్టమొదటి సారిగా బీసీల అండగా నిలిచిన సామాజిక సంస్కర్త వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అని ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రానికి ఉన్న 24 మంత్రి పదవుల్లో 11 బీసీలకు ఇచ్చిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల కోసం కొట్లాడుతుంటే.. సుప్రీం కోర్టు 20 శాతం రిజర్వేషన్‌ ఇచ్చిందని, జగన్‌ మాత్రం పార్టీ పరంగా 44 శాతం మేర బీసీలకే రిజర్వేషన్లు ఇచ్చారని ముఖ్యమంత్రి జగన్‌ రాజకీయ నాయకుడు కాదు.. సంఘ సంస్కర్త అని ఆర్. కృష్ణయ్య ప్రశంసించారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది