YS Jagan : జగన్ ఆశలన్నీ ఈయనపైనే.. కల నెరవేరుతుందా.?
YS Jagan : ఏపీలో వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి. కానీ.. ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్లను మార్చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల గవర్నర్లను మార్చిన కేంద్రం.. తాజాగా ఏపీ గవర్నర్ హరిచందన్ ను ఛత్తీస్ ఘడ్ కు పంపించేసింది. దీంతో కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఏపీకి నియమించింది. ఆయన ఇవాళే ఏపీకి వచ్చేశారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం కూడా కొత్త గవర్నర్ కు గ్రాండ్ గానే వెల్ కమ్ చెప్పింది.
అయితే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ రాష్ట్రానికి చాలా కీలకం. గవర్నర్ కు ఒకప్పుడు అంతగా ప్రాధాన్యం ఉండేది కాదు కానీ.. ఇప్పుడు గవర్నర్లకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. అందులో కొత్త గవర్నర్ విషయంలోనూ చాలా ఆశలతో ఉంది ఏపీ ప్రభుత్వం. ఏపీకి కొత్త గవర్నర్ గా నియమితులైన సయ్యద్ అబ్దుల్ నజీర్.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ఆయన ఇవాళే ఏపీ రాజ్ భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ కు స్వాగతం పలకడం అవన్నీ పక్కన పెడితే.. కేంద్రం కావాలనే..
YS Jagan : రాజ్ భవన్ కు చేరుకున్న కొత్త గవర్నర్
ఏపీకి రిటైర్ అయిన జడ్జిని గవర్నర్ గా పంపించింది అనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే ఏపీలో చాలా విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. మూడు రాజధానుల అంశం ఇంకా కొలిక్కి రాలేదు. వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి. ఈనేపథ్యంలో గవర్నర్ నిర్ణయమే కీలకం కానుంది. అందుకే.. గవర్నర్ పైనే రాష్ట్ర ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. కానీ.. ఈయన సుప్రీం కోర్టు న్యాయమూర్తి కావడంతో ఆయనతో ఎలా మెలగాలి అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. చూద్దాం మరి కొత్త గవర్నర్ విషయంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో?