Ys Jagan : కొత్త జిల్లాల ఏర్పాటుతో చరిత్రలో నిలిచి పోనున్న వైఎస్ జగన్
Ys Jagan : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకుని అభివృద్ధిలో మరియు పరిపాలనలో దూసుకు వెళుతోంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి మొదటి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు మాత్రం కొత్త జిల్లాల విషయంలో నిర్ణయాన్ని వెంటనే తీసుకోలేక పోయాడు. ఆయన ప్రభుత్వం ఉన్న సమయంలోనే కొత్త జిల్లాలకు సంబంధించిన చర్చ జరిగింది. కానీ రాజకీయంగా పెద్దగా ఉపయోగం లేని కారణంగా కొత్త జిల్లాల యొక్క విభజన ఏర్పాటు చంద్రబాబు నాయుడు దృష్టి సారించలేదు. కానీ సీఎం వైఎస్ జగన్ మాత్రం రాష్ట్రంలో నూతనంగా 13 జిల్లాలను ఏర్పాటు చేస్తూ అధికారికంగా ప్రకటించారు.
పాలనా వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లుగా ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది వికేంద్రీకరించాలని ఉద్దేశంతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న జిల్లాల భారీగా పెంచిన కారణంగా కచ్చితంగా భవిష్యత్తులో మంచి అభివృద్ధి జరుగుతుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఖచ్చితంగా వై.ఎస్.జగన్ని చరిత్రలో నిలుపుతుంది అంటూ ఆ పార్టీ నాయకులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కొత్త రాష్ట్రం యొక్క జిల్లాలను మరియు పరిపాలన యొక్క విధానాన్ని మారుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని భవిష్యత్ తరాల వారు ఎప్పటికీ గుర్తుంచుకునేలా చరిత్రలో నిలిచిపోతారు
ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు అభివృద్ధిలో వెనకబడి ఉన్న ఈ సమయంలో కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి దిశగా తీసుకువెళుతూ, మరో వైపు సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే నెంబర్ 1 అనిపించుకునేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ ద్వారా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న సీఎం జగన్ ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకటన తో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ఖచ్చితంగా సంచలన నిర్ణయం. దీనికి కేంద్రం నుండి కూడా అనుమతి రావడంతో జగన్ ముందు ముందు దూసుకు వెళ్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.