YS Jagan : రాష్ట్ర అభివృద్ది కోసం నరేంద్ర మోడీతో వైయస్ జగన్ గంట పాటు చర్చలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : రాష్ట్ర అభివృద్ది కోసం నరేంద్ర మోడీతో వైయస్ జగన్ గంట పాటు చర్చలు

 Authored By prabhas | The Telugu News | Updated on :7 April 2022,7:00 am

YS Jagan : ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ తో గంటకు పైగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్చించారు. ఈ మేరకు రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు ముందుకు వెళ్లాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి వినతి పత్రం అందజేశారు. పోలవరం ప్రాజెక్టు మరియు జాతీయ ఆహార భద్రత చట్టం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది.

ప్రధాని తో జగన్ భేటీకి సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.పోలవరం ప్రాజెక్టు సంబంధించిన పూర్తి పనుల బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలంటూ జగన్ కోరారని, అలాగే ప్రాజెక్టు నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన క్లియరెన్స్ ను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని అలాగే రాష్ట్రంలోని ఇతర ఎయిర్పోర్ట్ లకు సంబంధించిన నిర్ణయాన్ని కూడా వెంటనే తీసుకోవాలంటూ జగన్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం తో ఉన్న విభజన చట్టం విభేదాలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

YS Jagan meeting with pm narendra modi

YS Jagan meeting with pm narendra modi

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరియు రాజకీయ డెవలప్మెంట్ ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ చర్చించారని తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై కూడా జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కి విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది. దాదాపు గంట పాటు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో విజ్ఞప్తుల అందించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇప్పటికే పలు సార్లు కేంద్రానికి విజ్ఞప్తి అందినా కూడా వారి నుండి స్పందన కరువైంది. మరి ఈసారైనా ప్రధాని నరేంద్ర మోడీ సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క విజ్ఞప్తులను పట్టించుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారా అంటూ వైకాపా నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది