YS Jagan : 2024 కి వైఎస్ జగన్ దూకుడు.. ఇలా ఎవరైనా చేయగలరా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : 2024 కి వైఎస్ జగన్ దూకుడు.. ఇలా ఎవరైనా చేయగలరా?

 Authored By prabhas | The Telugu News | Updated on :8 June 2022,3:30 pm

YS Jagan : 2024 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుందని కొందరు అంటున్నారు కాని.. అసలైతే రెండు సంవత్సరాల సమయం ఉంది. ఈ రెండు సంవత్సరాల సమయం అనేది చాలా చాలా ఎక్కువ. జనాల్లో పార్టీలపై మూడ్ మారడం.. ఇంకా ఏదైనా జరగవచ్చు. కనుక అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఇప్పటి నుండే ఎందుకు లే అని కొందరు అనుకుంటూ ఉంటే కొందరు మాత్రం దూకుడు పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. సాదారణంగా అయితే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కోసం వెయిట్‌ చేస్తూ దూకుడుగా ఉండాలి. కాని ఏపీలో మాత్రం జగన్ దూకుడు మీదున్నాడు.

ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు టీడీపీ నుండి వెళ్లి పోతున్న వారిని లెక్కించుకోవడం సరిపోతుంది. కొడుకును ఈసారి అయినా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలంటే ఏం చేయాలా అంటూ ఆలోచించడం సరిపోతుంది అంటూ వైకాపా నాయకులు ఎద్దేవ చేస్తున్నారు. ఇక జనసేన పార్టీ నేత పవన్‌ కళ్యాణ్ పొత్తుల కోసం ప్రాకులాడుతున్నాడు. ఈ సమయంలో సీఎం జగన్ మాత్రం తన దూకుడు కొనసాగిస్తున్నాడు. అద్బుతమైన మెజార్టీని గత ఎన్నికల్లో కట్టబెట్టిన జనాలు మళ్లీ అంతకు మించిన మెజార్టీ కట్టబెట్టలా పథకాలు అందించాడు.

YS Jagan mohan reddy 2024 election plans

YS Jagan mohan reddy 2024 election plans

రెండు సంవత్సరాలు ఇంకా ఎన్నికలు ఉన్నా కూడా అప్పుడే అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్దం అయ్యాడు. సిట్టింగ్స్ ల్లో కొందరికి అవకాశం ఉండక పోవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మాజీ మంత్రులు అందరికి కూడా వారి వారి సీట్లు కన్ఫర్మ్‌ గా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో కొందరికి సీటు ఉండక పోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి త్వరలోనే మొదటి విడత అభ్యర్థుల జాబితాను జగన్ విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ఇలా ఏ ప్రభుత్వ అధినేత కూడా చేయడు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది