YS Jagan Mohan Reddy : రఘురామకృష్ణం రాజుకు పోటీగా ప్రభాస్ ని రంగంలోకి దింపుతున్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan Mohan Reddy : రఘురామకృష్ణం రాజుకు పోటీగా ప్రభాస్ ని రంగంలోకి దింపుతున్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!

YS Jagan Mohan Reddy : 2024 శాసనసభ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు వచ్చిన రాకపోయినా కొన్ని నియోజకవర్గాలలో మాత్రం కచ్చితంగా వైసీపీ గెలవాల్సి ఉంటుంది.ఎందుకంటే ఇవి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాలు. అందులో మొదటిది రఘురామకృష్ణంరాజు గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి పోటీ చేసిన నరసాపురం. ఇది వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని జగన్ తనదైన శైలిలో ప్లాన్ చేసుకున్నారు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :23 January 2024,8:30 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan Mohan Reddy : రఘురామకృష్ణం రాజుకు పోటీగా ప్రభాస్ ని రంగంలోకి దింపుతున్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!

YS Jagan Mohan Reddy : 2024 శాసనసభ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు వచ్చిన రాకపోయినా కొన్ని నియోజకవర్గాలలో మాత్రం కచ్చితంగా వైసీపీ గెలవాల్సి ఉంటుంది.ఎందుకంటే ఇవి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాలు. అందులో మొదటిది రఘురామకృష్ణంరాజు గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి పోటీ చేసిన నరసాపురం. ఇది వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని జగన్ తనదైన శైలిలో ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ఎప్పటినుంచో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రఘురామకృష్ణంరాజుగా ఏపీ రాజకీయాలు జరుగుతున్నాయి. 2019లో జగన్ ఫోటోతో జగన్ పార్టీ తరపున గెలిచిన రఘురామ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, తనను అవమానించారని ఇలా రకరకాల కారణాలతో వైసీపీ నుంచి బయటికి వచ్చి రెబల్ ఎంపీగా మారారు. ఆ రోజు నుంచి జగన్ వర్సెస్ రఘురామగా నడుస్తుంది.

ఆ తర్వాత కొన్నాళ్లకి రఘురామ చేసిన వ్యాఖ్యలకి జగన్ తనదైన శైలిలో రివేంజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, జగన్ తన పోలీసు అధికారులతో తనని కొట్టారని రఘురామ కృష్ణంరాజు నేరుగా కోర్టులో చెప్పడం అలాంటి హైడ్రామా నడిచింది. ఆ తర్వాత కాలం మొత్తం రఘురామకృష్ణం రాజు ఢిల్లీలో ఉంటూ వచ్చారు. ఏ రోజు కూడా నరసాపురానికి వచ్చే ప్రయత్నం చేయలేదుష రీసెంట్ గా సంక్రాంతికి రఘురామకృష్ణం రాజు నరసాపురం వచ్చే ప్రయత్నం చేశారు. రానున్న 2024 ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలిచి తీరుతానని నరసాపురం పార్లమెంటు నుంచి పోటీ చేస్తాను అని, ఎవరైనా ఓడించుకోవచ్చు అంటూ ఆయన సవాల్ విసిరారు.

ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజును ఓడించాలంటే ఒక మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవిని ఇక్కడ రంగంలో దించడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆమె ఇక్కడ పోటీ చేస్తే ఇద్దరు ఒకే సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గపు ఓట్లు ఎక్కువగా ఉండడంతో నేరుగా ప్రభాస్ ని రంగంలోకి దించి ప్రచారం కూడా చేయించుకోవచ్చని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండే పెద్దలు ప్రభాస్ తో చాలా క్లోజ్ గా ఉంటారు. ఇక యాత్ర 2 సినిమాని మూవీ క్రియేషన్స్ వారే తీస్తున్నారు. వంశీ, ప్రమోద్ ఇద్దరూ ప్రభాస్ కి సన్నిహితులు. ప్రభాస్ ని తన పెద్దమ్మకు సపోర్టుగా నరసాపురంలో ప్రచారం చేయించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని, తద్వారా రఘురామ కృష్ణంరాజును దెబ్బ కొట్టాలని జగన్ ప్లాన్ వేస్తున్నారని తెలుస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది