Ys Jagan : సెలవున్నా, పండగ ఉన్నా జగనన్న పించన్ మాత్రం ఆగదు.. వృద్దుల ఆనందం
Ys Jagan : ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు అయిన.. ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఉద్యోగుల జీతాలు అయినా కూడా ఒకటో తారీకు సెలవు ఉంటే ఆ మరుసటి రోజు వారి ఖాతాలో జమ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ప్రభుత్వ అధికారులు మరియు బ్యాంకు అధికారులు అంతా కూడా ఆదివారం మరియు పండగ సమయంలో సెలవు కావడం తో ఉద్యోగుల జీతాలు ఒకటో తారీఖు పడావు. జీతాలు పడాలి అంటే కచ్చితంగా వర్కింగ్ డే అయి ఉండాలి.
కానీ వృద్ధులకు మరియు వికలాంగులకు పింఛన్ మాత్రం పండగైనా సెలవేనా మరేదైనా ఆగకుండా నెలలో మొదటి రోజు ఇవ్వాల్సిందే అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను అధికారులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు మహా శివరాత్రి అయినా కూడా మార్చి 1వ తారీకునే వృద్ధులకు మరియు వికలాంగులకు వారి వారి పింఛన్లను పంపిణీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. పండగ పూట పింఛన్ రావడంతో వృద్ధులు ఆనందంతో ఉన్నారు.పండుగ సమయంలో కుటుంబ సభ్యులకు కాస్తా చేదోడు వాదోడు అయ్యేందుకు డబ్బులు కావాల్సి ఉండగా ఇలా జగన్ పింఛన్ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది అంటూ వారు ఆనందం వ్యక్తం చేశారు.
మహా శివరాత్రి పండుగ అయినా కూడా వాలంటీర్ల ద్వారా ఉదయం నుండి పింఛన్ ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అధికారులు మరియు వైకాపా కార్యకర్తల సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమం ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగింది. బ్యాంకు కు సెలవు అయినా కూడా అధికారులు ముందుగానే డబ్బులను వాలంటీర్లకు అందజేయడం ద్వారా వారు వెళ్లి వృద్ధులకు మరియు వికలాంగులకు ఇవ్వడం జరిగింది. ముందు ముందు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాగే కార్యక్రమాలను అమలు చేయాలంటూ అభిమానులు పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తూ చేశారు చేస్తున్నారు.