Ys jagan : ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై వైఎస్ జగన్ సమీక్ష.. గడువు లోపే అన్నీ పూర్తి
Ys jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ప్రతి ఒక్క ప్రాజెక్టు స్థితి గతులను సీఎం జగన్ మోహన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో పనుల యొక్క పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఆయన ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును గడువు లోపు పూర్తి చేయాలంటూ అధికారులకు మరియు కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. గడువు లోపు పూర్తి కాకుంటే కచ్చితంగా కాంట్రాక్టర్లకు జరిమానా విధించాలని ఉంటుందంటూ జగన్ హెచ్చరించారు. పోలవరంతో పాటు రాష్ట్రంలో రైతులు ఎదురు చూస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పనుల విషయంలో జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మరియు సామాన్యులు ఎంతో ఆసక్తిగా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేస్తే వారికి ప్రయోజనం చేకూరుతుంది. ప్రాజెక్టులు ఎంత ఆలస్యమైతే వారికి అంత నష్టం చేకూర్చే అవకాశం ఉంది. కనుక ప్రాజెక్టుల స్పీడ్ గా పూర్తి చేసి వారికి అందించాలని ఆ బాధ్యత మనందరిపై ఉందంటూ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లో తన క్యాంపు కార్యాలయం లో పోలవరం సహా పలు ప్రాజెక్టులకు సంబంధించిన అధికారులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
వీలైనంత త్వరగా కొత్త ప్రాజెక్టులకు డిజైన్లు తప్పించుకొని కాంట్రాక్టర్ల వెంట పడి మరీ పనులు చేయించుకోవాలని ఆదేశించారు. ఇక ప్రాజెక్ట్ ముంపు గ్రామాలను ప్రాధాన్యతా క్రమంలో తరలిస్తూ వారికి అన్యాయం జరగకుండా చూసుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్ష కార్యక్రమంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ ఇంకా జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సతీష్ కుమార్ పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.