YS Jagan : గంటా శ్రీనివాసరావు కాళ్ల కింద భూమి కంపించే న్యూస్ చెప్పిన వైఎస్ జగన్..!
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలో ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి నుంచే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. ఎక్కడైతే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ మాత్రం ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు సీఎం జగన్. ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాలపై సమీక్ష నిర్వహించారు. అందులో భాగంగానే విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ నేతలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు.
ఇక్కడ 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే. ఆయనకు వైజాగ్ లో బాగానే పలుకుబడి ఉంది. అందుకే.. గంటాను అక్కడ ఓడించాలంటే చాలా వ్యూహాలు పన్నాలని, ముందుగానే సరైన అభ్యర్థిని బరిలోకి దించాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. 2019 లో చేసిన తప్పులను మరోసారి రిపీట్ చేయొద్దని.. అందుకే విశాఖ నార్త్ నియోజకవర్గ నేతలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. అక్కడి పరిస్థితులను వాళ్లను అడిగి తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో 151 స్థానాలకే పరిమితం అయిన వైసీపీ.. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 ఎందుకు సాధించకూడదు అని సీఎం జగన్ పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. వై నాట్ 175 అంటూ నినదిస్తున్నారు.
YS Jagan : వై నాట్ 175 సీట్లు అని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్న సీఎం జగన్
అందుకే.. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖ నార్త్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలని తెలియజేశారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో 1.05 లక్షల ఇళ్లు ఉండగా అందులో దాదాపు 80 శాతానికి పైగా ఇళ్లలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు సంక్షేమ పథకాలు అందాయని సీఎం జగన్ నేతలకు వివరించారు. వైజాగ్ నార్త్ నియోజకవర్గంలో సమన్వయకర్తగా ఉన్న కేకే రాజునే వైజాగ్ నార్త్ నుంచి వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించారు. ముందే టీడీపీ సిట్టింగ్ లకు చంద్రబాబు టికెట్లు ప్రకటించడంతో సీఎం జగన్ కూడా ఆయా నియోజకవర్గాల్లో ముందే వైసీపీ అభ్యర్థులకు కూడా ప్రకటించాలని ఫిక్స్ అయిపోయారు.