సీఎం జగన్ సంచలన నిర్ణయం.. తాపీ మేస్త్రి కి మంత్రి పదవి
సీఎం జగన్ అధికారం చేప్పట్టిన నాటి నుండి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన పరిపాలన సాగిస్తున్నాడు. అదే సమయంలో అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఎవరిని దూరం చేసుకోకుండా తెలివిగా అడుగులు వేస్తున్నాడు. తన మంత్రి వర్గంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన సీఎం జగన్ ఒక్క సామాజిక వర్గానికి మాత్రం న్యాయం చేయలేకపోయాడు.. ఇప్పుడు దానిని భర్తీ చేయటానికి సిద్దమైనట్లు తెలుస్తుంది.
తన ప్రభుత్వానికి రెండున్నరేళ్లు నిండుతున్న సమయంలో తన మంత్రి వర్గంలో మార్పులు చేయాలనీ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో 90 శాతం మందిని మార్చబోతున్న అని చెప్పిన సీఎం.. ఇప్పుడు ఆ అవసరం లేదని కేవలం 20 శాతం మందిని మాత్రమే మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ క్రమంలో గౌడా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తన మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కూడా సీఎం భావిస్తున్నాడని సమాచారం.
అనూహ్యంగా తెర మీదకు వచ్చి ఎమ్మెల్యే
గత ఎన్నికల్లో అనూహ్యంగా తెర మీదకు వచ్చి ఎమ్మెల్యే టిక్కెట్ సాధించి, చిత్తూరు జిల్లా పలమనేరు నుండి గెలిచిన వెంకట గౌడా కు మంత్రి పదవి వారించే అవకాశం ఉందని తెలుస్తుంది. కేవలం ఐదు వరకే చదువుకున్న వెంకట గౌడా ఆ తర్వాత మేస్త్రి పని చేసి రియల్టర్ గా మరి అందులోనే పెద్ద స్థాయికి చేరుకున్నాడు. ఆ తర్వాత పెద్దిరెడ్డితో పరిచయం కలగటంతో రాజకీయ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత జగన్ దృష్టిలో పడి ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకొని గెలవటం జరిగింది. ఇక ఇప్పుడు అన్ని కుదిరితే మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉంది.
వెంకట గౌడా విషయంలో మంత్రి పెద్దిరెడ్డి సిపార్సు కూడా ఉందని తెలుస్తుంది. అదే విధంగా వెంకట్ గౌడా లాంటి యువనేత తన మంత్రి వర్గంలో ఉండాలని జగన్ కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదే కనుక జరిగితే మొదటిసారి ఎమ్మెల్యే కావటమే కాకుండా మొదటి సారి మంత్రి అయిన రికార్డు కూడా వెంకట గౌడ్ కు దక్కుతుంది. ఐదు వరకు చదువుకొని మేస్త్రి పనిచేసిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వటం అనేది జగన్ లాంటి నేతకే సాధ్యమైన పని మాత్రమే చెప్పుకోవాలి.