Ys Jagan : ఆ జిల్లా 10 మంది ఎమ్మెల్యేలపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : ఆ జిల్లా 10 మంది ఎమ్మెల్యేలపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌..!

 Authored By kondalrao | The Telugu News | Updated on :12 June 2021,9:00 am

Ys Jagan : పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2019 శాసన సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 13 చోట్ల నెగ్గింది. రెండు (ఏలూరు, నర్సాపురం) ఎంపీ సీట్లను కూడా కైవసం చేసుకుంది. 2014లో కూడా ఆ జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఇదే స్థాయిలో ఘన విజయాన్ని కట్టబెట్టారు. మొత్తం సెగ్మెంట్లను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమే సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు ప్రజలకు పెద్దగా మేలు చేయలేదని చెప్పొచ్చు. వాళ్లు నిజంగా జనానికి మంచి చేసుంటే 2019లో 15 మందికి 15 మంది ఎందుకు ఓడిపోతారు?. ఆ సంగతి ఇప్పుడు ఎందుకంటే ప్రస్తుతం ఈ జిల్లాలోని వైఎస్సార్సీపీ శాసన సభ్యుల్లో చాలా మంది 30 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం కలిగినవారే అయినప్పటికీ ఆ స్థాయిలో పనిచేయలేకపోతున్నారనే అభిప్రాయం నెలకొంది.

మంత్రులు పర్లేదు Ys Jagan

ఈ జిల్లా నుంచి ముగ్గురు శాసన సభ్యులు మంత్రులుగా ఉన్నారు. వాళ్లు.. ఆళ్ల నాని, తానేటి వనిత, రంగనాథరాజు. మినిస్టర్లుగా వీళ్లు కొద్దో గొప్పో ప్రభావం చూపుతున్నారు. అందువల్ల ఈ ముగ్గుర్ని పక్కన పెడితే మిగతా 10 మంది ఎమ్మెల్యేలు పేరుకే ఎమ్మెల్యేలుగా మిగిలిపోతున్నారని పబ్లిక్ అంటున్నారు.ఈ పది మంది ఎమ్మెల్యేలు ప‌నితీరు స‌రిగా లేద‌ని వీరిపై జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఉన్న‌ట్లు పార్టీ లో తెగ చ‌ర్చ జ‌రుగుతుంది. వాళ్లకు పార్టీ హైకమాండ్ వద్ద పలుకుబడి విషయంలో గానీ ప్రజలకు అవసరమైన పనులు చేయించటంలో గానీ ఫస్ట్ క్లాస్ మార్కులు పడట్లేదని చెబుతున్నారు. అఫ్ కోర్స్ వాళ్లు గెలిచిన ఈ రెండేళ్లలో రెండు సార్లు కరోనా వ్యాప్తి వల్ల బయట చురుకుగా వ్యవహరించి ఉండకపోవచ్చు. కానీ వచ్చే మూడేళ్లైనా యాక్టివ్ గా ఉంటే తప్ప మరోసారి ప్రజల ఆశీస్సులు పొందలేరని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ys jagan serious on west godavari Mlas

ys jagan serious on west godavari Mlas

దశాబ్దాల అనుభవం..: Ys Jagan

తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, నరసాపురం శాసన సభ్యుడు ముదునూరు ప్రసాదరాజు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తదితరులు ప్రజాజీవితంలో రెండు మూడు దశాబ్దాల నుంచి ఉంటున్నారు. అయినా చెప్పుకోదగ్గ స్థాయిలో పనులు చేయట్లేదనే టాక్ వినిపిస్తోంది. వీళ్లు పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లి నిధుల విషయంలో ఒత్తిడి చేయట్లేదనే విమర్శలు వస్తున్నాయి. పార్టీ హైకమాండ్ సైతం తమ ప్రాధాన్యతను గుర్తించట్లేదని వీళ్లు తమలో తామే మథనపడుతున్నారు. మంత్రి పదవులు కాకపోయినా ఇతరత్రా పోస్టులేవైనా ఇస్తే ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. వీళ్ల అభిప్రాయాలను, ఆవేదనను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎప్పటికి ఆలకిస్తారో చూడాలి.

ఇది కూడా చ‌ద‌వండి ==> Magnet Man Video : కరోనా టీకా తీసుకున్నాకా… అయస్కాంతంలా మారిన అత‌ని శ‌రీరం..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan : ఎమ్మెల్సీలుగా ఈ నలుగురిని ఫైన‌ల్ చేసిన వైఎస్ జగన్..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Ysrcp : వైఎస్సార్సీపీలో మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకొనేవారే లేరా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Ysrcp : ఆ ఎమ్మెల్యేకి ప్రమోషన్ పక్కా.. ఇదీ వైఎస్ జగన్ లెక్క..

Advertisement
WhatsApp Group Join Now

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది