Ysrcp : వైఎస్సార్సీపీలో మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకొనేవారే లేరా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ysrcp : వైఎస్సార్సీపీలో మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకొనేవారే లేరా..?

 Authored By kondalrao | The Telugu News | Updated on :11 June 2021,2:40 pm

Ysrcp : ఈరోజుల్లో పార్టీలు మారటం రాజకీయంలో ఒక భాగం. అదొక ఆర్ట్. జంపింగ్ చేయటానికి కూడా సరైన సమయం చూసుకోవాలి. ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయించటమే కరెక్ట్ నిర్ణయం. కొందరు ఏ పార్టీలోకి వెళ్లినా తాము అనుకున్నది సాధిస్తారు. దీనికి గంటా శ్రీనివాసరావును సరైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత మూడు నాలుగు పర్యాయాలుగా ఆయన ప్రతి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కొత్త పార్టీలోకి వెళుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ పొందుతున్నారు. గెలుస్తున్నారు. మంత్రి పదవిని సైతం కైవసం చేసుకుంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ.. కాంగ్రెస్ పార్టీ.. తెలుగుదేశం పార్టీ.. లేటెస్టుగా వైఎస్సార్సీపీలోకీ రావాలనుకున్నాడు. కానీ ఎందుకో లేటవుతోంది. అయితే ఇలా పార్టీ మారిన ప్రతిసారీ అందలం ఎక్కటం అందరికీ సాధ్యం కాదు. అందుకే గత రెండేళ్ల కాలంలో ఏపీలోని అధికార పార్టీలోకి వచ్చిన ఇతర పార్టీల వాళ్లు ఏం చేస్తున్నారు అనే అనుమానం జనాలకు కలుగుతోంది.

ఎవరు వాళ్లు?..

మాజీ శాసన సభ్యుడు పి.రమేష్ బాబు, రెహ్మాన్, టి.గురుమూర్తిరెడ్డి, మాజీ మంత్రి పి.బాలరాజు, కాశీ విశ్వనాథ్, ఏపీ మహిళా కాంగ్రెస్ చీఫ్ పి.రమణి కుమారి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్, హిందూపురం మాజీ శాసన సభ్యుడు రంగనాయకులు, అదే నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ మహ్మద్ ఇక్బాల్, టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్, మాజీ మంత్రి పాలేటి రామారావు, టీడీపీ సీనియర్ నాయకురాలు శమంతకమణి, సింగనమల మాజీ ఎమ్మెల్యే యామిని బాల.. ఇలా చెప్పుకుంటూపోతే ఈ జాబితా చాంతాడంత ఉంటుంది.

ysrcp leaders inactive In Party

ysrcp leaders inactive In Party

తెరమరుగేనా?..: Ysrcp

చాలా మంది నాయకులు తమ సొంత పనుల కోసం పార్టీలు మారుతుంటారు. వాళ్లు ఏ పార్టీలో ఉన్నా సైలెంటుగానే ఉంటారు. కాబట్టి వాళ్ల ఉనికి పెద్దగా ప్రశ్నార్థకమవదు. ఎప్పుడూ తెర వెనకే ఉంటారు. వాళ్లకు కావాల్సింది వ్యాపారాలు. రాజకీయాలు ముఖ్యం కాదు. కాబట్టి ఇలాంటివాళ్ల గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ ఏ పార్టీలో ఉన్నా హడావుడి చేసేవాళ్ల గురించే మాట్లాడుకోవాలి. ఇలా చురుకుగా వ్యవహరించే నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లినప్పుడు స్థానిక లీడర్లకు మైనస్ అవుతుంది. అందువల్ల వాళ్లను కొత్త పార్టీ వాళ్లు పైకి రానీయరు. ఈ కారణాలతో వైఎస్సార్సీపీలో ఎంతో మంది ఇతర పార్టీల నేతలు వెలుగులోకి రాలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. లక్, టైమ్ కలిసిరాకపోవటం ఇతరత్రా కారణాలు. సొంత పార్టీ మీద ఆగ్రహంతోనో లేక ఇగో ఫీలింగ్స్ తోనో జగన్ పార్టీలోకి వచ్చినవాళ్లు కూడా పెద్దగా పదవులను ఆశించరు. వాళ్లకు అహం చల్లారిందా లేదా అనేదే ముఖ్యం. ఇంకొంత మంది.. అధికార పార్టీ ఆగడాలకు, కక్ష సాధింపు ధోరణులకు జడిసి కూడా హ్యాండ్సప్ అనేస్తుంటారు.

ఇది కూడా చ‌ద‌వండి==> Ysrcp : ఆ ఎమ్మెల్యేకి ప్రమోషన్ పక్కా.. ఇదీ వైఎస్ జగన్ లెక్క..

ఇది కూడా చ‌ద‌వండి==> Ys Jagan : అటు బాబాయ్ కి.. ఇటు అబ్బాయ్ కి.. చెక్ పెట్టే పనిలో వైఎస్ జ‌గ‌న్..!

ఇది కూడా చ‌ద‌వండి==> Ys Jagan : మొద‌టి సారి ఒప్పుకున్న వైఎస్ జ‌గ‌న్‌..!

ఇది కూడా చ‌ద‌వండి==> దారుణం… భ‌ర్త ఆ పార్ట్‌ను కోసి పెనంపై కూర వండిన భార్య…!

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది