Ys Jagan : ఎమ్మెల్సీలుగా ఈ నలుగురిని ఫైన‌ల్ చేసిన వైఎస్ జగన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : ఎమ్మెల్సీలుగా ఈ నలుగురిని ఫైన‌ల్ చేసిన వైఎస్ జగన్..!

 Authored By kondalrao | The Telugu News | Updated on :11 June 2021,4:27 pm

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ లోని పెద్దల సభ(శాసన మండలి)ని రద్దు చేయాలని అధికార పార్టీ వైఎస్సార్సీపీ ప్రయత్నించినా అది ప్రస్తుతానికి సాధ్యం కాలేదు. దీంతో తమకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆ చట్ట సభలో ఖాళీ అయ్యే సభ్యుల స్థానాలను భర్తీ చేయాల్సిన అవసరం జగన్ సర్కారుకు ఉంది. ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల కోటాలో ఎన్నికై పదవీ విరమణ చేస్తున్నవారి స్థానాలను కొత్త వాళ్లతో భర్తీ చేసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలని నిర్వహించాల్సిన బాధ్యత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్(సీఈసీ)ది. కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఎలక్షన్ పెట్టేందుకు సీఈసీ సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో కనీసం గవర్నర్ కోటాలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకైనా అభ్యర్థులను ఎంపిక చేసి రాజ్ భవన్ కి పంపాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే.

సెలక్షన్ పూర్తి..

ఎలక్షన్ పెట్టాల్సిన అవసరంలేని నలుగురు క్యాండేట్ల సెలక్షన్ ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పూర్తి చేశారని అంటున్నారు. నాలుగు సామాజికవర్గాలకు చెందినవారికి సీఎం ఛాన్స్ ఇచ్చారని చెబుతున్నారు. కాపు (ఓసీ), బీసీ, ఎస్సీ, రెడ్డి (ఓసీ) కేటగిరీల కింద నలుగురిని ఎంపిక చేయటం అయిపోయిందని, రాజముద్ర వేసి గవర్నర్ కార్యాలయానికి పంపటమే తరువాయి అని తెలుస్తోంది. ఆ నలుగురిలో ఒకరు గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి కాగా ఇంకొకరు తూర్పు గోదావరి జిల్లా నాయకుడు తోట త్రిమూర్తులు (కాపు) అని సమాచారం. మూడో వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎస్సీ లీడర్ మోషేన్ రాజు అని, నాలుగో నేత కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన రమేష్ యాదవ్ (బీసీ) అని వినికిడి.

ys jagan selected 4 mlc candidates

ys jagan selected 4 mlc candidates

అన్నీ వైఎస్సార్సీపీ ఖాతాలోకే..: Ys Jagan

ఏపీ అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి బంపర్ మెజారిటీ ఉండటంతో ఎమ్మెల్సీ స్థానాలన్నీ అధికార పార్టీ ఖాతాలోకే వస్తున్నాయి. ఎన్నికలు పెట్టినా, పెట్టకపోయినా సంఖ్యా బలం వల్ల అవి సెంట్ పర్సెంట్ రూలింగ్ పార్టీకే దక్కుతాయి. గవర్నర్ కోటాలో నియమించే నలుగురిని ఖరారు చేసేందుకు పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. పార్టీ పట్ల విధేయత, సమర్థత, సామాజిక వర్గం, తాను గతంలో ఇచ్చిన హామీలు, పార్టీ ప్రయోజనాల కోసం ఆయా నేతలు చేసిన త్యాగాలు, పార్టీ భవిష్యత్ అవసరాలు వంటి వాటిని లెక్కలోకి తీసుకొని వీళ్లను అందలం ఎక్కిస్తున్నారని పొలిటికల్ పండితులు పేర్కొంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> Ysrcp : వైఎస్సార్సీపీలో మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకొనేవారే లేరా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Ysrcp : ఆ ఎమ్మెల్యేకి ప్రమోషన్ పక్కా.. ఇదీ వైఎస్ జగన్ లెక్క..

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan : అటు బాబాయ్ కి.. ఇటు అబ్బాయ్ కి.. చెక్ పెట్టే పనిలో వైఎస్ జ‌గ‌న్..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Ys Jagan : మొద‌టి సారి ఒప్పుకున్న వైఎస్ జ‌గ‌న్‌..!

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది