YS Jagan : చంద్రబాబుది పనికిరాని విజన్.! వైఎస్ జగన్ చెప్పేది నిజం.!
YS Jagan : దుగరాజపట్నం పోర్టు బాధ్యత కేంద్రానిది. అలాగని విభజన చట్టం చెబుతోంది. అయితే, విభజన చట్టంలో పోర్టుని కేంద్రం ఖచ్చితంగా నిర్మించాలని పేర్కొనబడలేదనీ, ఫీజిబిలిటీపై అధ్యయనం మాత్రమే చేయాలని పేర్కొన్నారనీ కేంద్రం సాకులు చెప్పి తప్పించుకుంది. అలా అప్పటి నరేంద్ర మోడీ ప్రభుత్వం లైట్ తీసుకోవడంలో, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతకానితనం కూడా కీలక పాత్ర పోషించింది. అదొక్కటే కాదు, కడప స్టీలు ప్లాంటు కావొచ్చు, విశాఖ రైల్వే జోన్ కావొచ్చు.. ఆఖరికి అమరావతి విషయంలో కావొచ్చు..
చంద్రబాబు, నరేంద్ర మోడీ ప్రభుత్వం వద్ద ఏపీ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేశారు. ప్రత్యేక హోదా అంశం కూడా ఇందే. అయితే, అప్పట్లోనే ఆయా అంశాలపై కేంద్రాన్ని ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష కూడా చేశారు. కడప స్టీలు ప్లాంటు విషయమై కేంద్రాన్ని నిలదీసినా ప్రయోజనం లేకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముందడుగు వేశారు.తాజాగా, దుగరాజపట్నం పోర్టుకు బదులు, రామాయపట్నం పోర్టు పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
ఎక్కడా పనులకు ఎలాంటి ఆటంకాలూ కలగకుండా, ముందస్తుగా అన్ని అనమతులూ వుండేలా చూసుకుని, పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సరిగ్గా, 36 నెలల్లో ఈ పోర్టుకి సంబంధించి తొలి దశ నిర్మాణ పనులు పూర్తయిపోతాయని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. చంద్రబాబులా ఆర్నెళ్ళలోనో.. ఏడాదిలోనో.. చేసేశాం.. అనిపించేసినట్టు కాకుండా, పక్కా ప్రణాళికతో వైఎస్ జగన్ సర్కారు రామాయపట్నం పోర్టు పనుల్ని ప్రారంభించింది. విజన్ పేరుతో చంద్రబాబు చేసే మాయకీ, నిజంగా వైఎస్ జగన్ చేసే అభివృద్ధి పనులకీ ఇంత పెద్ద తేడా వుంటుంది మరి.!