YS Jagan : అతిపెద్ద యుద్ధం ఆపడానికి సిద్ధమైన వైఎస్ జగన్ – రంగంలోకి దిగాడు..!!
YS Jagan : ఎక్కడైనా సరే.. ఏ పార్టీలో అయినా సరే అంతర్గత విభేదాల వల్ల పార్టీ నాయకులకే కాదు.. పార్టీకి కూడా తీరని నష్టం చేకూరుతుంది. తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే ఒక పార్టీ నాయకులు రోడ్డు మీదికి వచ్చి కొట్టుకుంటే అది ఆ పార్టీ నాయకత్వం మీద దెబ్బ పడినట్టే. అలాగే.. ఆ పార్టీ పరువు గంగలో కలిసినట్టే. అది అధికారంలో ఉన్న పార్టీ అయినా.. అధికారంలో లేని పార్టీ అయినా.. ఏదైనా ఒకటే. ప్రస్తుతం వైఎస్సార్సీపీ పార్టీలో అదే జరుగుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీలో గ్రూపులు ఏర్పడుతున్నాయి. ఆ గ్రూపులపై ఎప్పటికప్పుడు అధినాయకత్వం ఫోకస్ పెట్టాలి. లేకపోతే అది పార్టీకే తీరని నష్టాన్ని చేకూర్చుతుంది. అయితే.. కొన్ని నియోజకవర్గాల్లో ఏర్పడే సమస్యలను పరిష్కరించడం కోసం కొన్ని పార్టీలు కొందరు నేతలకు ఆ పనిని అప్పగిస్తాయి.
కానీ.. ఆ సమస్యలు పరిష్కారం కావు. దీంతో ఏకంగా హైకమాండే రంగంలోకి దిగాల్సి వస్తుంది. చిత్తూరు జిల్లా నగరిలో అదే జరిగింది. అక్కడ వైసీపీ నేతలు గ్రూపులుగా ఏర్పడి చేస్తున్న రాజకీయం చివరకు సీఎం జగన్ వరకు చేరింది. గ్రూపుల కుమ్ములాటల వల్ల పార్టీకి ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అని చివరకు సీఎం జగనే స్పందించి అక్కడి వ్యవహారాలను సెట్ చేయాల్సి వచ్చింది. అయితే.. మరోసారి మంత్రి రోజాకు నగరి నుంచి పోటీ చేసే అవకాశం రాదని తెలుస్తోంది. దానికి కారణం.. నియోజకవర్గంలో జరిగే గ్రూపు రాజకీయాలు అని అంటున్నారు. ఆమెకు ప్రత్యర్థి వర్గంగా నగరిలో ఒక గ్రూపు ఏర్పడిందని.. ఆ గ్రూపు చేస్తున్న ప్రచారమే ఇది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అంతే కాదు.. ఈ గ్రూపు తగాదాలు కూడా మంత్రి రోజాకు చిరాకు తెప్పిస్తున్నాయట.
YS Jagan : రోజాకు మరోసారి నగరి నుంచి పోటీ చేసే అవకాశం రాదా?
అక్కడ ముఠాలను మంత్రి పెద్దిరెడ్డి పెంచి పోషించారని చెబుతున్నారు. దీంతో నగరిలో వైసీపీ నేతల అంతర్గత కుమ్ములాటలు ఏకంగా రోడ్డు మీదికి రావడంతో ప్రత్యర్థి పార్టీలకు ఇది చాన్స్ గా దొరికింది. చివరకు రోజా తనంటే నియోజకవర్గంలో ఎక్కడా విలువ లేదని చెప్పుకొచ్చిన ఒక ఆడియో క్లిప్ కూడా ప్రస్తుతం వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమె సీఎం జగన్ దగ్గరికి వెళ్లే తన గోడును వెళ్లబోసుకున్నారట. అందుకే.. అక్కడి పరిస్థితులను ఏకంగా సీఎం జగన్ రంగంలోకి దిగి చక్కదిద్దాల్సిందే అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన సొంత పార్టీ అయినప్పుడు ఆ పార్టీలో ఏవైనా సమస్యలు ఉండే ఖచ్చితంగా సీఎం జగనే వాటిని పరిష్కరించాలి. అందుకే.. సీఎం జగన్ ఇలాంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. త్వరలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈ విషయంపై సీఎం జగన్ కూడా నజరు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.