YS Jagan : ఆ ఇద్దరి వల్లే వైసీపీకీ ఓటమి.. ఇక ఊరుకునేదేలే అంటున్న జగన్.. ఏకంగా పార్టీ బహిష్కరణే?

Advertisement

YS Jagan : ఏపీలో ప్రస్తుతం ఎన్నికల ప్రీ ఫైనల్స్ నడుస్తున్నాయి. అవును.. ప్రీ ఫైనల్స్ అంటే.. వచ్చే సాధారణ ఎన్నికలకు ఇవి వార్మప్ ఎన్నికలు అన్నమాట. సినిమా విడుదలకు ముందు వచ్చే టీజర్, ట్రైలర్ లా అన్నమాట. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆదిలోనే అధికార వైఎస్సార్సీపీ పార్టీకి షాకిచ్చాయి. మామూలుగా కాదు. ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఏడు సీట్ల కోసం జరిగిన ఎన్నికల్లో 8 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు.

YS Jagan who is responsible for ysrcp lost in ap mlc elections 2023
YS Jagan who is responsible for ysrcp lost in ap mlc elections 2023

ప్రతిపక్ష టీడీపీ పార్టీ ఒకే అభ్యర్థిని బరిలోకి దించినా ఆ అభ్యర్థి గెలుపొందారు. దీంతో ఆరుగురు వైసీపీ అభ్యర్థులు గెలవగా, ఒక సీటును టీడీపీ కైవసం చేసుకుంది. అసలు టీడీపీ గెలిచే మెజారిటీనే లేదు. కానీ.. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థిని పంచుమర్తి అనురాధ అనూహ్యంగా గెలుపొందారు. ఒక అభ్యర్థి గెలవాలంటే కనీసం 22 ఓట్లు కావాలి. కానీ.. పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు వచ్చాయి. అవి కూడా తొలి ప్రాధాన్యత ఓట్లు. దీంతో ఆమె గెలుపు ఖరారు అయింది. మరోవైపు అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలని భావించింది కానీ..

Advertisement

YS Jagan : 23 తొలి ప్రాధాన్యత ఓట్లు తెచ్చుకున్న పంచుమర్తి అనురాధ

అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేల బలం 19. కానీ.. నాలుగు ఓట్లు ఎక్కువగా పడ్డాయి. అంటే.. నాలుగు క్రాస్ ఓట్లు. అందులో రెండు వైసీపీ ఎమ్మెల్యేలు వేసిన ఓట్లు. అందులో ఒకటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మరోటి ఆనం రామనారాయణరెడ్డివి. మరో ఇద్దరు టీడీపీకి ఎవరు ఓటేశారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. అయితే.. వైసీపీ నుంచి టీడీపీకి వేసిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరో కూడా తెలుసు. వాళ్ల పని అవుట్ అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ.. వాళ్ల పేర్లు మాత్రం చెప్పడం లేదు.

Advertisement
Advertisement