YS Jagan : ఆ శాఖ తీసుకోవాలంటే భయం.. జగన్ ఎవరికి కేటాయిస్తారో మరి..
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి త్వరలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో మినిస్టర్స్ అందరినీ మార్చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే కొత్త మంత్రి వర్గంలో సమర్థులైన వారిని మాత్రమే తీసుకుని వారికి శాఖలు అప్పగించాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. కాగా, వైసీపీ నేతలు ఆ శాఖను తీసుకోవాలంటే భయపడుతున్నారట. ఆ శాఖకు మంత్రిగా పని చేస్తే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని అనుకుంటున్నారని సమాచారం. ఈ విషయాలు అంతర్గత సంభాషణల ద్వారా తెలుస్తోంది.జగన్ అధికారంలోకి రాకమునుపు ఏపీ రాష్ట్రమంతటా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంలో పలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు వైసీపీ అధినేత. ‘నవరత్నాల’ పేరిట హామీలిచ్చి ప్రస్తుతం వాటి అమలును 90 శాతం చేశారు కూడా.
అయితే, ఆ ఒక్క హామీ విషయంలో జగన్ వెనక్కి తగ్గారు. అదేంటంటే.. మద్యపాన నిషేధం. మద్యం దుకాణాలను ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావడం తప్ప వేరే ఏం చేయలేదు జగన్. ఇకపోతే ఏపీలో పేరు తెలియని నాసిరకం బ్రాండ్స్ విక్రయాలు పెరగడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇది జగన్ ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ తీసుకొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో జగన్ మంత్రి వర్గ విస్తరణలో ఎక్సైజ్ శాఖను ఎవరికి కేటాయిస్తారనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రజెంట్ నారాయణస్వామి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఆయనను ఈ సారి ఆ శాఖ నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ, ఆ శాఖకు రాబోయే కొత్త మంత్రి ఎవరు అనేది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
YS Jagan : హామీ నెరవేరేనా?
చాలా మంది వైసీపీ నేతలు మనసులో మంత్రి వర్గంలో చోటు దక్కాలని ఉందని, కానీ, ఎక్సైజ్ శాఖ మాత్రం వద్దనే కోరుకుంటున్నారట. చూడాలి మరి..జగన్ ఫైనల్‌గా తన కేబినెట్‌లో ఎక్సైజ్ శాఖను ఎవరికి కేటాయిస్తారో.. ఎక్సైజ్ శాఖ ఇప్పుడు వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.